Sai Pallavi : ముద్దు సీన్ల‌పై తేల్చేసిన సాయి ప‌ల్ల‌వి.. ఆ విధంగా చేస్తాన‌ని చెప్పింది..!

September 29, 2021 11:08 PM

Sai Pallavi : శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శక‌త్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్‌స్టోరీ. ఈ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి మంచి టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌గానే క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. అయితే భార‌త్ బంద్ రావ‌డం, గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ కార‌ణంగా.. క‌లెక్ష‌న్ల‌పై కొంత మేర ప్ర‌భావం ప‌డింది. కానీ రెండో వారం పూర్త‌య్యే స‌రికి క‌లెక్ష‌న్లు పుంజుకుంటాయ‌ని ఆశిస్తున్నారు.

Sai Pallavi : ముద్దు సీన్ల‌పై తేల్చేసిన సాయి ప‌ల్ల‌వి.. ఆ విధంగా చేస్తాన‌ని చెప్పింది..!
Sai Pallavi

ఇక ల‌వ్ స్టోరీ మూవీ విడుద‌లైనా కూడా చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను సాయి ప‌ల్ల‌వి మీడియాతో పంచుకుంది.

తాను ఎల్ల‌ప్పుడూ ముద్దు స‌న్నివేశాల్లో న‌టించ‌లేద‌ని, అలా ఇక ముందు కూడా చేయ‌న‌ని సాయి ప‌ల్ల‌వి తేల్చి చెప్పింది. అయితే ల‌వ్ స్టోరీలో నాగ‌చైత‌న్య‌ను ముద్దు పెట్టుకున్న‌ట్లుగా ఉన్న సీన్ కెమెరా మెన్ ట్రిక్ అని తెలిపింది.

సినిమాల్లో ముద్దు స‌న్నివేశాల‌పై ముందుగానే ద‌ర్శ‌కుల‌ను అడుగుతాన‌ని, అలాంటి సీన్లు లేవ‌ని చెబితేనే సినిమా చేస్తాన‌ని సాయి ప‌ల్ల‌వి చెప్పుకొచ్చింది. ఇక లవ్ స్టోరీ షూటింగ్‌కు ముందే శేఖ‌ర్ క‌మ్ముల‌కు ఈ విష‌యం చెప్పి క్లారిటీ తీసుకున్నాన‌ని సాయి ప‌ల్ల‌వి తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now