Sai Pallavi : సాయి పల్లవి కోసం 20 సార్లు ఆ సినిమా చూశా.. నటుడు రాహుల్..

September 29, 2021 10:48 PM

Sai Pallavi : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఫీల్ గుడ్ సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా ఈ నెల 24వ తేదీ విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో సాయి పల్లవి డాన్స్ కు ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని సాయి పల్లవి డాన్స్ పై రాహుల్ రవీంద్ర ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

Sai Pallavi : సాయి పల్లవి కోసం 20 సార్లు ఆ సినిమా చూశా.. నటుడు రాహుల్..
Sai Pallavi Movie Watched by Rahul

ఈ సినిమాలో సాయి పల్లవి డాన్స్ అద్భుతంగా చేసిందని, కేవలం ఆమె డాన్స్ కోసమే ఈ సినిమాను 20 సార్లు చూశానని ఈ సందర్భంగా రాహుల్ రవీంద్ర ట్వీట్ చేశాడు. అతని ట్వీట్ కి సాయిపల్లవి స్పందిస్తూ.. ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాహుల్ రవీంద్ర మాట్లాడుతూ సాయి పల్లవి డ్యాన్స్‌తోనే ఓ పూర్తిస్థాయి సినిమాని ఎవరైనా తెరకెక్కిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

కుల వ్యవస్థ, అమ్మాయిలపై కుటుంబ సభ్యులే ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే సున్నితమైన విషయాన్ని తీసుకొని ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారని ఈ సందర్భంగా రాహుల్ రవీందర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు కథ అవసరం లేదని, సాయి పల్లవి డాన్స్ ఒక్కటే చాలని ఈ సందర్భంగా సాయి పల్లవి డాన్స్ పై రాహుల్ రవీంద్ర ప్రశంసలు కురిపించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now