RRR Movie : రాజమౌళి RRR నుంచి మరొక అప్‌డేట్‌.. ఎప్పుడంటే ?

September 29, 2021 6:45 PM

RRR Movie : బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమా RRR. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తుండడం చేత ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో పోస్టర్లు, మేకింగ్ వీడియోలు, పాటలు విడుదలయ్యి.. ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్‌డేట్‌ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

RRR Movie : రాజమౌళి RRR నుంచి మరొక అప్‌డేట్‌.. ఎప్పుడంటే ?
RRR Movie

అక్టోబర్ 10వ తేదీన దర్శకుడు జక్కన్న పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌ డేట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఒక మేకింగ్ వీడియోను విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్న చిత్ర బృందం మరోసారి మేకింగ్ వీడియోను విడుదల చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అదేవిధంగా అక్టోబర్ 10వ తేదీ రాజమౌళి పుట్టినరోజు సందర్భంగానే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఆలియాభట్, హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరీస్ లు నాయికలుగా నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now