Niharika : పోసాని కృష్ణ‌ముర‌ళిపై నిహారిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

September 29, 2021 12:36 PM

Niharika : జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌టుడు, వైసీపీ కార్య‌క‌ర్త పోసాని కృష్ణ ముర‌ళి చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఇప్ప‌టికే పోసాని వ్యాఖ్య‌ల‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పోసానిపై పలు చోట్ల పోలీస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే మ‌రోవైపు పోసాని వ్యాఖ్య‌ల‌పై మెగా డాట‌ర్ నిహారిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Niharika : పోసాని కృష్ణ‌ముర‌ళిపై నిహారిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Niharika

Niharika : పోసానికి మెంట‌ల్‌.. హాస్పిట‌ల్‌లో చేర్పించాలి..

ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పోసాని తిట్టినందుకు గాను పోసానిపై నిహారిక ఫైర్ అవుతూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పోసానికి పిచ్చి ప‌ట్టింద‌ని, ఆయ‌న‌ను వెంట‌నే మెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చేర్పించాల‌ని పేర్కొంది. ప్ర‌భుత్వం ఈ విష‌యంపై స్పందించి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.

Niharika : పోసాని కృష్ణ‌ముర‌ళిపై నిహారిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Niharika

రిప‌బ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ ఆడవాళ్ల గురించి మాట్లాడ‌లేద‌ని నిహారిక తెలిపింది. కేవ‌లం సీఎం జ‌గన్ గురించి మాట్లాడినందుకే పోసాని అలా ప‌వ‌న్‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిడుతున్నార‌ని తెలిపింది. అందుక‌ని పోసానిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now