Love Story : మా ప్ర‌యాణం ఆగిపోతుంద‌ని బాధ ప‌డుతున్నా : నాగ చైత‌న్య

September 28, 2021 11:32 PM

Love Story : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌వ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మూవీలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌విల న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అయితే ఈ మూవీకి గాను చిత్ర బృందం స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌విలు ఈ మూవీ గురించి త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

Love Story : మా ప్ర‌యాణం ఆగిపోతుంద‌ని బాధ ప‌డుతున్నా : నాగ చైత‌న్య
Love Story

ల‌వ్ స్టోరీ మూవీ స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీట్‌లో నాగ చైత‌న్య మాట్లాడుతూ.. తాను శేఖ‌ర్ క‌మ్ముల నుంచి ఎన్నో కొత్త కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాన‌ని అన్నారు. అయితే ప్ర‌స్తుతం సినిమా విడుద‌ల అయింది క‌నుక ఇక ఆయ‌న‌తో ప్ర‌యాణం చేయ‌లేన‌ని, అందుకు బాధ‌గా ఉంద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ క‌ల‌సి ప‌నిచేస్తామ‌న్న ధీమా వ్య‌క్తం చేశారు.

Love Story : మా ప్ర‌యాణం ఆగిపోతుంద‌ని బాధ ప‌డుతున్నా : నాగ చైత‌న్య
Love Story

ఇక త‌న సినిమా విడుద‌లైన తొలి రోజు నుంచే ప్రేక్ష‌కుల స్పంద‌న ఎలా ఉందో తాను స్వ‌యంగా తెలుసుకుంటాన‌ని, త‌న సినిమాపై విమ‌ర్శ‌కులు ఏమంటున్నారోన‌ని తెలుసుకుంటాన‌ని తెలిపాడు. క‌రోనా వ‌ల్ల ఇలాంటి విష‌యాలు తెలుసుకోలేక‌పోయాన‌ని, అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఆ అవ‌కాశం ల‌భించింద‌న్నారు. ల‌వ్ స్టోరీ విడుద‌ల కావ‌డంతో ఎంతో ఆనంద ప‌డ్డాన‌ని తెలిపారు. థియేట‌ర్‌కు వ‌చ్చి సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ చెప్పారు. శేఖ‌ర్ క‌మ్ముల నుంచి ఎన్నో విష‌యాల‌ను తెలుసుకున్నాన‌ని, సినిమా విడుద‌ల‌తో త‌మ ఇద్ద‌రి ప్ర‌యాణం ఆగిపోతుంద‌ని బాధ క‌లుగుతుంద‌ని అన్నారు.

Love Story : మా ప్ర‌యాణం ఆగిపోతుంద‌ని బాధ ప‌డుతున్నా : నాగ చైత‌న్య
Love Story

అనంత‌రం సాయిప‌ల్ల‌వి మాట్లాడుతూ.. చిత్ర బృందం స‌మిష్టిగా కృషి చేయ‌డం వ‌ల్లే మూవీ అద్భుతంగా వ‌చ్చి హిట్ అయింద‌న్నారు. అందుకు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాన‌ని అన్నారు.

Love Story : మా ప్ర‌యాణం ఆగిపోతుంద‌ని బాధ ప‌డుతున్నా : నాగ చైత‌న్య
Love Story

శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో మూవీ విడుద‌ల‌పై ఆందోళ‌న చెందాన‌ని, ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని ఖంగారు ప‌డ్డాన‌ని అన్నారు. అయితే సినిమా హిట్ కావ‌డంతో సంతోషంగా ఉంద‌న్నారు.

Love Story : మా ప్ర‌యాణం ఆగిపోతుంద‌ని బాధ ప‌డుతున్నా : నాగ చైత‌న్య
Love Story

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now