Posani : ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించినందుకు వేలాది మంది ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు చేసి తిడుతున్నారు: పోసాని

September 28, 2021 8:11 PM

Posani : సాయిధ‌ర‌మ్ తేజ్‌కు చెందిన రిప‌బ్లిక్ మూవీ ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వం, మంత్రుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమోగానీ ఆ వివాదం పెను దుమారంగా మారుతోంది. దీనిపై పోసాని కృష్ణ‌ముర‌ళి ఇప్ప‌టికే ఘాటుగా స్పందించారు. ప‌వ‌న్‌ను ఆయ‌న విమ‌ర్శించారు. అయితే ఇది జీర్ణించుకోలేని ప‌వన్ ఫ్యాన్స్ పోసానికి గ‌త 24 గంట‌ల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్ చేశారు. మెసేజ్‌లు పెట్టారు. కాగా దీనిపై పోసాని తాజాగా మీడియాతో మాట్లాడారు.

Posani : ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించినందుకు వేలాది మంది ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు చేసి తిడుతున్నారు: పోసాని
Posani

పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు వచ్చాయని పోసాని కృష్ణమురళి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ క‌క్ష కట్టి మాట్లాడటం సరికాద‌ని, పవన్‌ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు.

త‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు పీక‌ల దాకా కోపం ఉంద‌ని పోసాని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్‌పై త‌న‌కు కోపం లేద‌న్నారు. తాను జ‌గ‌న్ అభిమానిని అని, త‌న‌కు శ‌త్రువులు ఎవ‌రూ లేర‌ని అన్నారు. ప‌వ‌న్ అభిమానుల్లా తాను అస‌భ్య ప‌ద‌జాలంతో మాట్లాడ‌న‌ని అన్నారు. ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించినందుకు త‌న‌కు రాత్రి నుంచి కొన్ని వేల ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు వ‌చ్చాయ‌న్నారు.

ఇంత మాట్లాడినా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న రెమ్యున‌రేష‌న్ గురించి ఎందుకు పెద‌వి విప్ప‌లేద‌ని పోసాని అన్నారు. చిరంజీవి అంటే త‌న‌కు ఎంతో అభిమాన‌మ‌ని అన్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ సైకోల‌ని, వాళ్ల‌కు ఏం చెప్పుకుంటావో చెప్పుకో.. అని పోసాని అన్నారు. రాజ‌కీయాల్లో త‌న గురించి మాట్లాడాల‌ని, త‌న కుటుంబాన్ని ఇందులోకి లాగొద్ద‌ని అన్నారు. చిరంజీవి గారు, మీ త‌మ్ముడిని అదుపులో పెట్టుకోండి.. అని పోసాని పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now