Crime News : కన్న కూతురిపై అత్యాచారం చేయబోయిన తండ్రి.. ఊహించని షాక్ ఇచ్చిన కూతురు..

September 28, 2021 4:47 PM

Crime News : ప్రస్తుత కాలంలో రోజు రోజుకూ అత్యాచార ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఏమాత్రం వావి వరసలు లేకుండా చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఆడది కనబడితే చాలు.. వారిపై కామాంధులు అత్యాచారానికి ప్రయత్నిస్తున్నారు. చివరికి కడుపున పుట్టిన కన్నకూతురిపై కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో మనుషులలో మానవత్వం మంటగలిసి పోతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది.

Crime News : కన్న కూతురిపై అత్యాచారం చేయబోయిన తండ్రి.. ఊహించని షాక్ ఇచ్చిన కూతురు..

తమిళనాడులోని విల్లుపురం జిల్లా కోవిల్‌పురాయూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ దివ్యాంగుడు. కొన్ని రోజుల క్రితం తన భార్యమరణించింది. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె ఒక వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. చిన్న కుమార్తె ఇంటర్ చదువుతోంది. తమిళనాడులో స్థానిక ఎన్నికలు జరగడంతో అందుకు నామినేషన్ వేసిన వెంకటేష్ ను కలవడం కోసం కొందరు బంధువులు వచ్చారు. అయితే అతని ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న అతన్ని చూసి షాక్ అయిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ముందుగా రాజకీయ హత్యగా భావించిన వీరు ఆ తర్వాత తన కన్న కూతురు హత్య చేసిందని తేలడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది. తన తండ్రి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతోనే ఆత్మరక్షణ కోసమే ఈ పని చేశానని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య కేసులో మరింత లోతుగా విచారణ జరపాలని జిల్లా ఎస్పీ శ్రీనాథ ఆదేశించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment