దారుణం.. భార్యాభర్తల మధ్య గొడవలు.. బలైన 22 రోజుల పసికందు..

September 26, 2021 8:36 PM

కడుపున పుట్టినబిడ్డ అన్న మమకారం లేకుండా 22 రోజుల పసిగుడ్డుపై ఓ తండ్రి తన పైశాచికత్వాన్ని చూపించాడు. తాగిన మత్తులో తన బిడ్డ, తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆ చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..

దారుణం.. భార్యాభర్తల మధ్య గొడవలు.. బలైన 22 రోజుల పసికందు..

సైదాబాద్ పరిధిలోని పూసల బస్తీలో తాగిన మైకంలో రాజేష్ అనే వ్యక్తి తన భార్య జాహ్నవి, 22 రోజుల చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలోనే పసిబిడ్డకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. తన భర్త తాగొచ్చాడన్న కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి చివరికి చిన్నారి ప్రాణాల మీదకు తీసుకువచ్చారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందడంతో పోలీసులు రాజేష్ అలియాస్ రాజును కస్టడీలోకి తీసుకున్నారు. అయితే మృతి చెందిన చిన్నారి వీరికి రెండో సంతానం కాగా మొదటి సంతానం ఒక బాబు పుట్టగా బాబు ఐదు నెలల వయసులో ఉన్నప్పుడు రాజు తాగొచ్చి ఆ బాలుడిని ఇంటి నుంచి బయటకు విసిరాడు. ఈ క్రమంలోనే ఆ బాలుడిని సంరక్షణకోసం యూసఫ్ గూడలోని శిశు విహార్ లో చేర్చారు. కాగా రెండవ సంతానం కూడా ఈ విధంగా వారి మధ్య ఘర్షణలకు బలైపోయాడని స్థానికులు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment