వామ్మో.. పగ తీర్చుకోవడం కోసం 22 కిలోమీటర్లు పరుగెత్తిన కోతి..!

September 26, 2021 3:27 PM

సాధారణంగా పాములు పగ పడతాయన్న విషయం మనం విన్నాం. కానీ కోతులు పగపట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కర్ణాటకకు చెందిన ఈ కోతి పగ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ కోతి పగ కారణంగా చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహర గ్రామ ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా జగదీష్ అనే వ్యక్తి కోతి పేరు ఎత్తితేనే భయంతో వణికిపోతున్న ఘటన చోటుచేసుకుంది. అసలు కోతి ఆ వ్యక్తిపై పగ పెంచుకోవడానికి కారణం ఏమిటి ? అనే విషయానికి వస్తే..

వామ్మో.. పగ తీర్చుకోవడం కోసం 22 కిలోమీటర్లు పరుగెత్తిన కోతి..!

సాధారణంగా కోతులు మన చేతిలో ఏదైనా తినుబండారాలు ఉంటే లాక్కొని వెళ్తుంటాయి. ఈ క్రమంలోనే గ్రామంలో తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడం చేత పాఠశాల పిల్లలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే ఉద్దేశంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి కోతులను పట్టుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే
బోనెట్ మకాక్ జాతికి చెందిన ఒక మగ కోతి అటవీ అధికారులకు చుక్కలు చూపించింది. ఎంత ప్రయత్నించినా అధికారులకు దొరకకపోవడంతో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ల సహాయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే జగదీశ్ అనే వ్యక్తి కోతిని చాలా ఇబ్బంది పెడుతూ ఉండడంతో.. ఆగ్రహించిన ఆ కోతి అతనిపై దూకి విపరీతమైన గాయాలతో మొత్తం కొరికి ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆ కోతి బారి నుంచి తప్పించుకుని పారిపోయి ఒక ఆటోరిక్షాలో దాక్కోవలసి వచ్చింది. అధికారులు ఆ కోతిని పట్టుకొని 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. ఆ కోతి బెడద తప్పిందని గ్రామస్తులు అందరూ సంతోషం వ్యక్తం చేసినప్పటికీ జగదీష్ మాత్రం ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదు.

అయితే కోతి బెడద తప్పిందన్న సంతోషం కొన్ని రోజులు కూడా గడవకముందే ఆ కోతి తిరిగి గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు మరోసారి భయంతో వణికి పోతున్నారు. ఇదే విషయాన్ని గ్రామస్తులు అటవీ అధికారులకు తెలియజేయగా అధికారులు మరోసారి ఆ కోతిని పట్టుకొని మరింత దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ మనుషులపై పగ పెంచుకుని కోతి 22 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రావడం గమనార్హం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment