రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?

September 26, 2021 1:32 PM

సాధారణంగా మనం ఐరన్ వస్తువులను ఎక్కువగా గాలి, వెలుతురు తాకే చోట పెడితే తొందరగా అవి తుప్పుపట్టి నాశనమవుతాయి. ఇవి గాలిలో ఉన్న ఆక్సిజన్ తో చర్యలు జరిపి తుప్పు పట్టడానికి కారణమవుతాయి. ఈ క్రమంలోనే రైలు పట్టాలను కూడా ఇనుముతోనే తయారు చేస్తారు కదా. మరలాంటప్పుడు అవి నిత్యం వెలుతురు, గాలి తాకే ప్రదేశాలలో ఉన్నప్పటికీ ఎందుకు తుప్పు పట్టవు ? అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరి రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..

రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా మనం సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కనుక రైలు పట్టాలను నిర్మించేటప్పుడు ఎంతో నాణ్యమైన ఉక్కును ఉపయోగిస్తారు. ఈ ఉక్కులో  1% కార్బన్, 12% మాంగనీస్ కలిపి తయారు చేస్తారు. అందుకే వీటిని ‘సీ-ఎంఎన్’ రైల్ స్టీల్ అని కూడా అంటారు. ఎంతో
నాణ్యమైన ఉక్కుతో తయారు చేస్తారు కనుక సంవత్సరానికి 0.05 మి.మీ మాత్రమే తుప్పు పడుతుంది కాబట్టి 1 మి.మీ. రైల్ ట్రాక్ తుప్పు పట్టడానికి సుమారుగా 20 సంవత్సరాల కాలం పడుతుంది. అందుకనే ఎక్కువ ఏళ్ల పాటు పట్టాలు గాలి, వెలుతురులో ఉన్నా.. అవి తుప్పు పట్టవు. అవి తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఇదే.

ఇక రైలు కింద అధిక ఒత్తిడికి రైలు పట్టాలు గురవుతాయి కనుక ఎప్పుడైనా, ఎక్కడైనా రైలు పట్టాలు పాడైనట్టు అనిపించినా వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యి వెంటనే వాటిని తొలగించి కొత్తవి వేస్తారు. అదే విధంగా రైల్వే ట్రాక్ తుప్పు పట్టకుండా కోటింగ్ వేస్తారు కనుక రైలు పట్టాలు త్వరగా తుప్పు పట్టవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment