రెండు చేతులతో పరిగెడుతూ గిన్నిస్‌ బుక్ రికార్డుకెక్కిన యువకుడు.. ఎందరికో ఆదర్శం!

September 26, 2021 12:03 PM

సాధారణంగా ఏదైనా పని చేయాలంటే మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా ఉండాలని భావిస్తాము. ఈ క్రమంలోనే కొందరు శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఎలాంటి చిన్న పని చేయకుండా సోమరితనంతో బద్ధకంగా ఉంటారు. కానీ తన శరీరంలో కాళ్లు లేకపోయినా చేతుల సహాయంతో పరుగులు తీస్తూ గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు.. యూఎస్ కి చెందిన జియోన్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

రెండు చేతులతో పరిగెడుతూ గిన్నిస్‌ బుక్ రికార్డుకెక్కిన యువకుడు.. ఎందరికో ఆదర్శం!

జియోన్ కు పుట్టుకతోనే కాడల్ రిగ్రెషన్ అనే సిండ్రోమ్ వచ్చింది. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. ఈ వ్యాధితో పుట్టినప్పటికీ ఏ మాత్రం తనలో నిరుత్సాహం లేకుండా కాళ్లు లేకున్నప్పటికీ చేతులు ఉన్నాయి కదా.. అంటూ చేతులతో తన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకునేవాడు. ఈ క్రమంలోనే ప్రతి రోజు జిమ్ కు వెళ్లి వర్క్  అవుట్స్ చేసేవాడు. జియోన్ కి చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యం ఉండేది. ఎలాగైనా తను రెజ్లర్, అథ్లెట్ లేదంటే ఒలింపిక్స్ లో గానీ మెడల్ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు.

https://www.instagram.com/reel/CUGkx0rpXKE/?utm_source=ig_embed&ig_rid=7edbbc1f-6d64-4fd5-ac84-6250d2a60d79

ఈ లక్ష్యంతోనే గ్రౌండ్ లోకి దిగి తన కాళ్లు లేకున్నప్పటికీ చేతుల సహాయంతో పరుగు తీయడం ప్రాక్టీస్ చేశాడు. ఇలా చేతులతో పరుగులు తీస్తూ తను అనుకున్న విధంగానే రెజ్లర్, అథ్లెట్ అయ్యాడు. ఈ క్రమంలోనే 20 మీటర్ల దూరాన్ని, 4.78 సెకండ్లలో అత్యంత వేగంగా పరుగు తీసి గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. పుట్టుకతోనే కాళ్లను కోల్పోయిన జియోన్ ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా దృఢసంకల్పంతో తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment