ఒక్క బాయ్ ఫ్రెండ్ కోసం త‌న్నుకున్న న‌లుగురు యువ‌తులు.. వైర‌ల్ వీడియో..!

September 21, 2021 9:40 PM

ప్రేయ‌సీ ప్రియుల మ‌ధ్య‌లోకి ఎవ‌రైనా వ‌స్తే వారికి ఇక బ‌డితె పూజ త‌ప్ప‌దు. అన‌వ‌స‌రంగా జంట‌లు లేదా దంప‌తుల మ‌ధ్య ఎవ‌రూ క‌ల‌గ‌జేసుకోకూడ‌దు. వారి మానాన గొడ‌వ‌ప‌డి వారే పోతారు. అయితే అక్క‌డ జ‌రిగింది వేరే. ఒక బాయ్ ఫ్రెండ్ కోసం ఏకంగా న‌లుగురు యువతులు త‌న్నుకున్నారు. మ‌ధ్య‌లో అడ్డువ‌చ్చిన ఇంకో యువ‌కునిపై వారు చేయి చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఒక్క బాయ్ ఫ్రెండ్ కోసం త‌న్నుకున్న న‌లుగురు యువ‌తులు.. వైర‌ల్ వీడియో..!

బీహార్‌లోని ముజ‌ఫ‌ర్ పూర్ సిటీలో ఉన్న మోతిజ్‌హీల్ ప్రాంతంలోని ఒక మాల్‌లో ఇద్ద‌రు యువతులు ఒక బాయ్ ఫ్రెండ్ కోసం త‌న్నుకోవ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఇంకో యువ‌తి వ‌చ్చి వారితో గ‌లాటాకు దిగింది. దీంతో ఇద్ద‌రి పొట్లాట కాస్తా ముగ్గురి మ‌ధ్య జ‌రిగింది. అనంత‌రం ఇంకో యువ‌తి వ‌చ్చి అందులో చేరింది. దీంతో మొత్తం న‌లుగురు యువతులు ఒకే ఒక బాయ్ ఫ్రెండ్ కోసం త‌న్నుకున్నారు.

https://youtu.be/huXjaqPeEzM

అయితే ఓ వ్య‌క్తి వారిని వారించ‌బోయాడు. కానీ అత‌ను కూడా వారిచే దెబ్బ‌లు తినాల్సి వ‌చ్చింది. అయితే చివ‌ర‌కు మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారిపై ఆగ్ర‌హించి అక్క‌డి నుంచి వారిని పంపించేశారు. కానీ పోలీసులు మాత్రం త‌మకు ఈ సంఘ‌ట‌న‌పై ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌లేద‌ని తెలిపారు. అయితే అక్క‌డ ఉన్న‌వారంతా ఈ గొడ‌వ తాలూకు ఫొటోలు, వీడియోల‌ను చిత్రీకరించారు. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment