రైల్వే ప్లాట్‌ఫాం మీద అంచున ఉండే ఈ ప‌సుపు రంగు లైన్‌ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

September 20, 2021 11:08 AM

రైళ్ల మీద వివిధ ర‌కాల పెట్టెల‌పై కొన్ని ర‌కాల కోడ్స్ ఉంటాయి. కొన్ని ఆంగ్ల అక్ష‌రాల్లో ఉంటే కొన్ని సంకేతాలు ఉంటాయి. అలాగే రైల్వే స్టేష‌న్ల‌లోనూ ప‌లు చోట్ల భిన్న ర‌కాల కోడ్స్ మ‌న‌కు క‌నిపిస్తుంటాయి. వీట‌న్నింటికీ వేర్వేరు అర్థాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా రైల్వే వ్య‌వ‌స్థ న‌డుస్తుంటుంది. అయితే రైల్వే ప్లాట్‌ఫాం మీద అంచున ఉండే ప‌సుపు రంగు లైన్‌ను మీరు చాలా సార్లు గ‌మ‌నించే ఉంటారు క‌దా. దాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ?

రైల్వే ప్లాట్‌ఫాం మీద అంచున ఉండే ఈ ప‌సుపు రంగు లైన్‌ను ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

సాధార‌ణంగా రైలు ప్లాట్‌ఫాం మీద వెళ్లిన‌ప్పుడు దాని వేగాన్ని బ‌ట్టి ప్లాట్‌ఫాం అంచున ఒక ర‌క‌మైన ప్ర‌త్యేక‌మైన వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేస్తుంది. అది ఎరుపు రంగు టైల్స్ ఉన్న ప్రాంతంలో సృష్టించ‌బ‌డుతుంది. ఆ ప్ర‌దేశంలో ఉంటే రైలు వేగం ద్వారా ఉత్ప‌త్తి అయ్యే గాలికి మ‌నం రైలు ద‌గ్గ‌ర‌కు నెట్టివేయ‌బ‌డ‌తాము. దీంతో రైలు కింద ప‌డే అవ‌కాశాలు ఉంటాయి.

క‌నుక ఎరుపు రంగు టైల్స్ ఉన్న చోట నిల‌బ‌డరాదు. ప‌సుపు రంగు లైన్ దాటి లోప‌లికి నిల‌బ‌డ‌కూడ‌దు. దానికి ఇవ‌త‌లి వైపు నిలుచోవాలి. దీంతో సుర‌క్షితంగా ఉంటాము. అందుక‌నే ప్లాట్‌ఫాం అంచున ప‌సుపు రంగు లైన్ వేస్తారు. దాన్ని దాటి ముందుకు పోకూడ‌దు. రైలు వేగంగా ఉంటే అది మ‌న‌ల్ని ద‌గ్గ‌ర‌కు లాక్కునే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుకనే ప‌సుపు రంగు లైన్‌ను దాటి చివ‌రి వ‌ర‌కు పోకూడ‌దని సూచ‌న‌గా ఆ లైన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇదీ.. అస‌లు విష‌యం..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment