‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పాటించాల్సిన నిబంధనలు ఇవే!

September 18, 2021 8:46 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే నువ్వా నేనా అంటూ తీవ్ర స్థాయిలో అభ్యర్థులు మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవికి అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మా ఎన్నికల నోటిఫికేషన్ ను అధికారికంగా విడుదల చేశారు. అక్టోబర్ 10వ తేదీ ఆదివారం ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్ ప్రభుత్వ పాఠశాలలో జరగనున్నట్లు నోటిఫికేషన్ లో వెలువరించారు. అలాగే ఎన్నికల జరిగిన రోజే ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంటుందని ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్ తెలియజేశారు.

'మా' ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పాటించాల్సిన నిబంధనలు ఇవే!

8 మంది ఆఫీస్ బేరర్స్, 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ లతో కూడిన కమిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎన్నికల నిబంధనలు నియమాల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 30వ తేదీ నామినేషన్ల పరిశీలన, నామినేషన్లను ఉపసంహరణ కోసం అక్టోబర్ 1-2 వ తేదీలలో సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది.

ఉపసంహరణ గడువు తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరగగా అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఎన్నికల ఫలితాలను తెలియజేయనున్నారు. ఇక ఈ ఎన్నికలలో భాగంగా నియమ నిబంధనల విషయానికి వస్తే ఒక పోస్టుకు కేవలం ఒక అభ్యర్థి మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగులకు హాజరు కానివారు ఈ పోటీలకు అర్హత కోల్పోతారు.

24 క్రాఫ్ట్స్ లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్నవారు రాజీనామా చేస్తేనే ఈ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించింది. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ నియమ నిబంధనలను విడుదల చేయగా.. ఇప్పటికే ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహ రావు ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now