రియ‌ల్ లైఫ్ టార్జాన్.. 41 ఏళ్లు అడ‌విలో ఉన్నా ఏమీ కాలేదు.. 4 ఏళ్లు సిటీలో గ‌డిపాడు.. అంతే.. అనారోగ్యంతో చ‌నిపోయాడు..!

September 15, 2021 10:06 PM

ఈ ఆధునిక ప్ర‌పంచంలో నిత్యం మ‌నం అనేక వ్యాధుల‌తో స‌త‌మ‌తం అవుతున్నాం. మ‌నం పాటించే ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వ‌ల్లే మ‌న‌కు అనేక అనారోగ్యాలు వ‌స్తున్నాయి. అలాగే నిత్యం మ‌నం తిరిగే వాతావ‌ర‌ణం, కాలుష్యం వ‌ల్ల కూడా వ్యాధులు వ‌స్తున్నాయి. అందువ‌ల్ల న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ప్ర‌స్తుతం నివ‌సించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

రియ‌ల్ లైఫ్ టార్జాన్.. 41 ఏళ్లు అడ‌విలో ఉన్నా ఏమీ కాలేదు.. 4 ఏళ్లు సిటీలో గ‌డిపాడు.. అంతే.. అనారోగ్యంతో చ‌నిపోయాడు..!

అయితే న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో నివ‌సిస్తే ఎంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మో అత‌నికి జ‌రిగిన సంఘ‌ట‌న మ‌న‌కు చాటి చెబుతుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

1972లో వియ‌త్నాంలో యుద్ధం జ‌ర‌గ‌డం వ‌ల్ల హో వాన్ లాంగ్ ను త‌న తండ్రి అడ‌విలోకి తీసుకెళ్లాడు. ఆ త‌రువాత అక్క‌డి కువాంగ్ గాయ్ ప్రావిన్స్ లో ఉన్న టే ట్రా జిల్లాలోని ద‌ట్ట‌మైన అడ‌విలో ఆ ఇద్ద‌రూ నివాసం ఉన్నారు. ఈ క్ర‌మంలోనే 2013లో లాంగ్ తండ్రి చ‌నిపోయాడు. త‌రువాత 4 ఏళ్ల‌కు.. అంటే 2017లో లాంగ్ సిటీకి మ‌కాం మార్చాడు.

అయితే అడ‌విలో ఉన్న‌ప్పుడు స్వ‌చ్ఛ‌మైన వాతావ‌ర‌ణం ఉండేది. చ‌క్క‌ని ఆహారం తినేవాడు. కానీ సిటీకి వ‌చ్చాక లైఫ్ స్టైల్ మారిపోయింది. లాంగ్ ఎక్కువ‌గా మ‌ద్యం సేవించేవాడు. ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాల‌ను ఎక్కువ‌గా తినేవాడు. దీంతో అత‌నికి లివ‌ర్ క్యాన్స‌ర్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అత‌ను ఇటీవ‌లే మృతి చెందాడు.

అలా అత‌ను 41 ఏళ్ల పాటు అడ‌విలో ఉన్నా అత‌నికి ఏమీ కాలేదు. కానీ కేవ‌లం 4 ఏళ్లు సిటీలో ఉండి జీవ‌న విధానాన్ని అస్త‌వ్య‌స్తం చేసుకున్నాడు. దీంతో లివ‌ర్ క్యాన్స‌ర్ వ‌చ్చి చ‌నిపోయాడు. అందుక‌నే స‌హ‌జసిద్ధ‌మైన ప్ర‌కృతిలో నివ‌సిస్తే ఎక్కువ కాలం పాటు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండ‌వచ్చ‌ని నిపుణులు చెబుతుంటారు. అది ఇత‌ని విష‌యంలో అక్ష‌రాలా నిజ‌మే అనిపిస్తుంది క‌దా..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment