బాబోయ్‌.. ఒకే చెట్టుకు ఏకంగా 40 ర‌కాల‌కు పైగా పండ్ల‌ను పండించాడు..!

September 14, 2021 11:00 PM

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పండు అయినా స‌రే దాని చెట్టుకు అదే కాస్తుంది. ఆ చెట్టుకు ఇత‌ర పండ్లు పండ‌వు. కానీ ఆ ప్రొఫెస‌ర్ మాత్రం అసాధ్య‌మైన ప‌నిని సుసాధ్యం చేసి చూపించారు. ఒకే చెట్టుకు ఏకంగా 40 ర‌కాలకు పైగా పండ్ల వెరైటీల‌ను పండించి రికార్డు సృష్టించారు.

బాబోయ్‌.. ఒకే చెట్టుకు ఏకంగా 40 ర‌కాల‌కు పైగా పండ్ల‌ను పండించాడు..!

సైరాక్యూజ్ యూనివ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ వాన్ అకెన్ ఒకే చెట్టుకు ఏకంగా 40 ర‌కాల‌కు పైగా పండ్ల వెరైటీల‌ను పండించారు. అందుకు గాను ఆయ‌న‌కు 9 ఏళ్లు ప‌ట్టింది. ఒక చెట్టుకు వివిధ ర‌కాల చెట్ల‌కు చెందిన కొమ్మ‌ల‌ను ఆయ‌న అంటు పెట్టారు. దీంతో ఆ చెట్టు అనూహ్యంగా పెరుగుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో దానికి ఇటీవ‌లే 40 ర‌కాల‌కు పైగా పండ్లు పండాయి.

ఆ చెట్టుకు ప్ల‌మ్స్‌, పీచెస్‌, యాప్రికాట్స్, చెర్రీలు.. ఇలా 40 ర‌కాల‌కు పైగా పండ్లు పండాయి. దీంతో ఆ చెట్టును చూసేందుకు చాలా మంది వెళ్తున్నారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment