ఈ సమస్యతో బాధపడేవారికి.. కరోనా ముప్పు ఎక్కువ?

April 16, 2021 7:13 PM

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే రోజురోజుకు కరోనా కేసులతో పాటు కరోనా కొత్త లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి గురించి మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరైతే చిగుళ్ళు వ్యాధి సమస్యతో బాధపడుతుంటారో అలాంటి వారిలో కరోనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.

చిగుళ్ళు చెడిపోయినప్పుడు మన నోటిలో వ్యాపించిన వైరస్ లు నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి రక్తంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గౌడ్స్ డెంటల్‌ పరిశోధనా బృందం లీడ్ డాక్టర్‌ వికాస్‌గౌడ్‌ వెల్లడించారు. నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోయినా, చిగుళ్ళు వాపు ఉన్న వారిలో కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

మధుమేహం, క్యాన్సర్, పొగాకు, గుట్కా వంటి అలవాట్లు ఉన్న వారికి ఎక్కువగా చిగుళ్ళు సమస్యలు ఉంటాయని, అలాంటి వారు ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయిన దంతాలను శుభ్రం చేయించుకుంటూ నోటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధులను క్రమంగా తగ్గించవచ్చని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment