విమర్శకుల నోళ్లకు దీటుగా బదులు చెప్పిన అర్షిఖాన్‌.. అన్ని పండుగలను జరుపుకుంటానని జవాబు..

September 13, 2021 11:44 AM

సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో నిత్యం తమ అప్‌డేట్స్‌ గురించి పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటారు. వారు ఏ పని చేసినా దానికి సంబంధించిన ఫొటోలను లేదా వీడియోలను, టెక్ట్స్‌ సందేశాలను సోషల్‌ మీడియాలో పెడుతుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు సీన్‌ రివర్స్‌ అవుతుంది. వారు చేసే పనులను చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. బిగ్‌బాస్‌ హిందీ ఫేమ్‌, నటి అర్షి ఖాన్‌ ఇటీవల వినాయక చవితి సందర్భంగా తన ఇంట్లో గణేషుడికి పూజలు చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయితే ఆమెను నెటిజన్లు ట్రోల్‌ చేస్తూ విమర్శిస్తున్నారు.

విమర్శకుల నోళ్లకు దీటుగా బదులు చెప్పిన అర్షిఖాన్‌.. అన్ని పండుగలను జరుపుకుంటానని జవాబు..

అర్షిఖాన్‌ ముస్లిం అయి ఉండి హిందువుల పండుగను ఎలా జరుపుకుంటుందంటూ అనేక మంది ఆమెను ట్రోల్‌ చేస్తూ విమర్శించారు. అయితే వాటికి అర్షిఖాన్‌ గట్టిగానే బదులిచ్చింది. తాను ఒక ముస్లింనే అని, కానీ అంతకన్నా ముందుగా ఒక ఇండియన్‌ను అని తెలిపింది.

https://www.instagram.com/p/CTp2o_9IAnE/?utm_source=ig_embed&ig_rid=365191ba-2e7d-43f0-b00b-4c3bf4942ce1

భారతీయురాలిగా తాను అన్ని పండుగలను జరుపుకుంటానని అర్షిఖాన్‌ తెలిపింది. ఈద్‌ పండుగకు తన ఇంటికి తన హిందూ ఫ్రెండ్స్‌ వస్తారని, అందరితో కలిసి పండుగ జరుపుకుంటానని, అందులో భాగంగానే వినాయక చవితికి గణేష్‌కి పూజలు చేశానని తెలిపింది. కానీ ఇది కొందరికి నచ్చడం లేదని, వారు తీవ్రంగా విమర్శిస్తూ తిడుతున్నారని, అలాంటి వారు తనను ఫాలో కావల్సిన పనిలేదని, కామెంట్లు చేయకండి, వెళ్లిపోండి.. అంటూ ఆమె ఘాటుగా, దీటుగా బదులిచ్చింది. కాగా ఆమె చేసిన ఈ పోస్ట్‌ మళ్లీ వైరల్‌ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment