యంగ్ టైగర్ సంతకం ఎప్పుడైనా చూశారా?

September 30, 2021 8:28 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తారక్ కోసం తన ఇంటికి వచ్చిన అభిమానులను తరచూ ఎన్టీఆర్ కలుసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఇంటికి వెళ్లి తన కొడుకు పెళ్ళికి రమ్మని ఎన్టీఆర్ ను ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలోనే ఆ అభిమాని తన అభిమాన హీరో నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

ఎన్టీఆర్ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్న సదరు అభిమాని ఎన్టీఆర్ సంతకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇప్పటివరకు తారక్ సంతకం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు చూడండి అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం తారక్ సంతకం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.

ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కనుందని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now