వామ్మో.. కొన్ని సెక‌న్లు ఆల‌స్యం అయి ఉంటే పాము కాటుకు బ‌ల‌య్యేవాడు, కొద్దిలో త‌ప్పించుకున్నాడు.. వైర‌ల్ వీడియో..!

September 10, 2021 6:42 PM

మ‌నం మ‌న ప‌రిస‌రాల ప‌ట్ల చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. మ‌న‌కు ప్ర‌మాదం ఎటు వైపు నుంచి వ‌స్తుందో అస్స‌లు తెలియ‌దు. ఏమ‌రుపాటుగా ఉంటే ప్రాణాలు క్ష‌ణాల్లో పోతాయి. అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌డం చాలా అరుదుగానే జ‌రుగుతుంది. వెంట్రుక వాసిలో త‌ప్పిపోయింది అంటారు క‌దా.. అలాగ‌న్న‌మాట‌. జీవితంలో ఎవ‌రో ఒక‌రికి ఏదో ఒక స‌మ‌యంలో ఇలా జ‌రుగుతుంటుంది. ఆ బాలుడి విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

వామ్మో.. కొన్ని సెక‌న్లు ఆల‌స్యం అయి ఉంటే పాము కాటుకు బ‌ల‌య్యేవాడు, కొద్దిలో త‌ప్పించుకున్నాడు.. వైర‌ల్ వీడియో..!

ఓ చిన్న డ‌బ్బా కొట్టులోకి ఓ బాలుడు ప్ర‌వేశించేందుకు య‌త్నించాడు. చూస్తే అత‌ను బ‌య‌ట‌కు ఏదో ప‌ని కోసం వెళ్లి తిరిగి త‌న డబ్బాలోకి వ‌చ్చేందుకు య‌త్నించాడు. పై నుంచి ఎక్కి లోప‌లికి వెళ్ల‌బోయాడు. అయితే అప్ప‌టి వ‌ర‌కు అత‌ను ఫోన్‌ను చూస్తూ ఉంటూ స‌డెన్‌గా డ‌బ్బాలో పైకి చూశాడు. అంతే.. వెంట‌నే అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు.

అత‌ను వెళ్లిన కొన్ని సెక‌న్ల‌లోనే ఓ తాచు పాము అత‌ను ఉండాల్సిన చోట కింద ప‌డింది. చూస్తే అది ఓ ఎలుక‌ను త‌రుముతున్న‌ట్లు మ‌న‌కు స్ప‌ష్ట‌మ‌వుతుంది. అయితే కొన్ని సెక‌న్లు అత‌ను అక్క‌డే ఉండి ఉంటే అత‌ను పాము కాటుకు గుర‌వ్వాల్సి వ‌చ్చేది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. చివ‌రి నిమిషంలో అత‌ను పైకి చూడ‌బ‌ట్టి ప్ర‌మాదాన్ని గ్ర‌హించి వెంట‌నే ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు. లేదంటే పాము కాటుకు అత‌ను బ‌లై ఉండేవాడు.

కాగా ఆ దృశ్యాలు అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. దీంతో ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ బాలుడికి అదృష్టం ఉంద‌ని లేదంటే ప్రాణాలు పోయి ఉండేవ‌ని కామెంట్లు చేస్తున్నారు. అవును.. నిజంగా అత‌నికి ల‌క్ ఉంద‌నే చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment