వీడియో తీయమని ఏనుగుకు ఫోన్ ఇచ్చారు.. ఏనుగు చేసిన పని చూసి షాక్ అయ్యారు..!

September 8, 2021 11:06 PM

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎంతో హాస్యాస్పదంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వీడియోలను చూసినప్పుడు మనం కూడా ఎంతో నవ్వుకుంటున్నాం. జంతువులు చేసే చిలిపి పనులు, అల్లరిపనులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్ల చేత నవ్వుల పువ్వులను పూయిస్తోంది.

వీడియో తీయమని ఏనుగుకు ఫోన్ ఇచ్చారు.. ఏనుగు చేసిన పని చూసి షాక్ అయ్యారు..!

తాజాగా ఓ జంట ఏనుగుకు వీడియో తీయమని ఫోన్ ఇచ్చారు. అయితే ఆ ఫోన్ పట్టుకున్న ఏనుగు చేసిన పని చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు. ప్రస్తుతం ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఈ వీడియోలో ఏముందంటే.. ఒక అమ్మాయి అబ్బాయి తమతో పాటు ఉన్న ఒక పెద్ద ఏనుగుకు వీడియో తీయమని ఏనుగు తొండానికి సెల్ ఫోన్ అందించారు. ఈ క్రమంలోనే వారు వీడియోకి అనుగుణంగా ఫోజులిస్తూ డాన్సులు చేశారు. ఇక ఓ సందర్భంలో అమ్మాయి అబ్బాయిని ఎత్తుకొని తిప్పగా ఏనుగు కూడా సంతోషంతో తన ఫోన్ తిప్పింది.

https://www.instagram.com/reel/CTevNq4A9pJ/?utm_medium=copy_link

ఈ విధంగా ఏనుగు తీసిన ఆ జంట వీడియోను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ ఏనుగు ఆ జంట వీడియో తీయకుండా సెల్ఫీ కెమెరా ఆన్ చేసి తన వీడియోను తీసుకుంది. ఈ క్రమంలోనే ఆ వీడియోలో ఏనుగు ముఖం కనిపించింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు చేసిన చిలిపి పనికి ఫన్నీగా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment