సినిమాల్లో చూపించే లాజిక్‌లు.. నిజ జీవితంలో అస్సలు పనిచేయవు..!!

September 8, 2021 11:11 AM

సినిమాల్లో మనం అనేక రకాల లాజిక్‌ లేని సీన్లను చూస్తుంటాం. అనూహ్యమైన సన్నివేశాలు వస్తుంటాయి. చాలా వరకు సినిమాల్లో లాజిక్‌ లేకుండానే సీన్లు తీస్తారు. కొన్ని మూవీల్లోనూ లాజిక్‌ మెయింటెయిన్‌ చేస్తారు. అయితే సినిమాల్లో చూపించే లాజిక్‌లు సినిమాలు కాబట్టి పనిచేస్తాయి, కానీ నిజ జీవితంలో అస్సలు పనిచేయవు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమాల్లో చూపించే లాజిక్‌లు.. నిజ జీవితంలో అస్సలు పనిచేయవు..!!

? సినిమాల్లో అయితే హీరో ఒక అమ్మాయిని చూడగానే ఆమె తిరిగి చూస్తుంది. దీంతో హీరో తనను ఆమె లవ్‌ చేస్తుందని భావిస్తాడు. లవ్‌ స్టోరీ అలా మొదలవుతుంది. రియల్‌ లైఫ్‌లో అలా జరగదు. అపరిచిత వ్యక్తులను ఎవరూ అలా చూడరు. లవ్‌ స్టోరీ అన్నది మొదలు కాదు.

? సినిమాల్లో అయితే అమ్మాయిని టీజ్‌ చేస్తే ఆమె సంతోషంగా ఫీలైనట్లు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో అలా చేస్తే వేధింపుల కేసు పెట్టి లోపలేస్తారు.

? హీరోయిన్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయినా, రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే హీరో ఆమె జీవితంలో ప్రవేశించేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. నిజ జీవితంలో అలా జరగడం దాదాపుగా అసాధ్యం. మరో విధమైన సంబంధం అయితే తప్ప ఆ విధంగా జరగదు.

సినిమాల్లో చూపించే లాజిక్‌లు.. నిజ జీవితంలో అస్సలు పనిచేయవు..!!

? సినిమాల్లో హీరో రోడ్‌ సైడ్‌ రోమియో అయినప్పటికీ కథ సుఖాంతం అవుతుంది. నిజ జీవితంలో అలా కాదు. జాబ్‌ ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ తెలుసు.

? సినిమాల్లో అమ్మాయిలను లవ్‌లో పడేయడం తేలికైన పనిగా చూపిస్తారు. నిజ జీవితంలో అది చాలా అసాధ్యమైన ప్రక్రియ.

ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా సినిమాల్లో లాజిక్‌ లేని ఎన్నో సీన్లను చూపిస్తుంటారు. సినిమాలు కనుక మనం పెద్దగా పట్టించుకోం. కానీ నిజ జీవితంలో ఆ లాజిక్‌లు వర్కవుట్‌ అవవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment