ఈ చెట్టును మీ ఇంట్లో నాటితే అన్ని దోషాలు తొలగిపోయి డబ్బు వస్తుంది..!!

September 7, 2021 5:09 PM

ఆయుర్వేద పరంగా ఎన్నో వృక్షాల‌కు చెందిన భాగాల‌ను ఔష‌ధాలుగా వాడుతారు. వాటితో అనేక వ్యాధుల‌ను త‌గ్గిస్తారు. అయితే కొన్ని ర‌కాల వృక్షాలు వాస్తు దోషాల‌ను కూడా తొల‌గిస్తాయి. అలాంటి వృక్షాల్లో అశోక వృక్షం ఒక‌టి. దీన్ని ఇంటి ద‌గ్గ‌ర ప్ర‌త్యేక‌మైన స్థలంలో నాట‌డం వ‌ల్ల అనేక వాస్తు దోషాలు పోతాయి. స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

ఈ చెట్టును మీ ఇంట్లో నాటితే అన్ని దోషాలు తొలగిపోయి డబ్బు వస్తుంది..!!

వీధి పోటు ఉన్న ఇళ్ల‌కు లేదా కార్యాల‌యాల‌కు ఏ దిక్కులో వీధిపోటు ఉంటే అక్క‌డ అశోక వృక్షం నాట‌వ‌చ్చు. దీంతో వీధిపోటు వ‌ల్ల వాస్తు దోషం ఏర్ప‌డ‌కుండా ఉంటుంది. స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లో నైరుతి, ప‌డ‌మ‌ర, ఉత్త‌రం దిక్కుల‌లో ఈ వృక్షాన్ని పెట్టుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఇల్లు, చుట్టు ప‌క్క‌ల ప‌రిస‌రాల్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ త‌గ్గుతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది. వాస్తు దోషాలు పోతాయి. ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. డ‌బ్బు చేతిలో నిలుస్తుంది. ధ‌నం ఎక్కువ‌గా ల‌భిస్తుంది.

అశోక అంటే.. శోకాన్ని త‌గ్గించేది అని.. అంటే దుఃఖాన్ని త‌గ్గించేది అని అర్థం వ‌స్తుంది. అందుక‌నే ఈ వృక్షాన్ని ఇంట్లో పెట్టుకుంటే మ‌న‌కు ఉండే శోకాలు త‌గ్గుతాయి. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఈ వృక్షాన్ని ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు, దోషాలు పోతాయి. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. డ‌బ్బు ఎక్కువ‌గా సంపాదిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment