వాహ‌నాల‌కు ఇన్సూరెన్స్ ఎంత ముఖ్య‌మో ఈ ఒక్క య‌దార్థ సంఘ‌ట‌న చెబుతుంది..!

September 4, 2021 5:47 PM

“స‌రిగ్గా 6 ఏళ్ల కింద‌ట‌.. అంటే 2015లో బ‌జాజ్ ప‌ల్స‌ర్ 180 బైక్ తీసుకున్నా. మొద‌టి ఏడాది రూ.1800 ప్రీమియం చెల్లించి పూర్తి ఇన్సూరెన్స్ తీసుకున్నా. క్లెయిమ్ మొత్తం రూ.8500గా నిర్ణ‌యించారు. త‌రువాత ఏడాది రూ.80,000 క్లెయిమ్ వ‌స్తుంద‌ని చెప్పి ఇన్సూరెన్ కంపెనీ వారు రూ.2000 ప్రీమియం క‌ట్టించుకున్నారు.”

వాహ‌నాల‌కు ఇన్సూరెన్స్ ఎంత ముఖ్య‌మో ఈ ఒక్క య‌దార్థ సంఘ‌ట‌న చెబుతుంది..!

“మూడో ఏడాదికి క్లెయిమ్‌ను రూ.75,000కు త‌గ్గించారు. కానీ ప్రీమియం మాత్రం రూ.2000 వ‌సూలు చేశారు. దీంతో అంత ప్రీమియం ఎందుకు చెల్లించాలి ? ఇన్సూరెన్స్ కంపెనీ వారు మోసం చేస్తున్నారు.. అనుకుని నాలుగో ఏడాది ప్రీమియం రూ.1850 మాత్ర‌మే చెల్లించా.”

“కంపెనీ వారు మాత్రం రూ.70,000 క్లెయిమ్ వ‌స్తుంద‌ని చెప్పి రూ.2300 క‌ట్ట‌మ‌న్నారు. కానీ నేను రూ.50,000 క్లెయిమ్ చాలులే అని రూ.1850 చెల్లించా. నా బైక్‌ను ఎవ‌రు దొంగిలిస్తారులే, అన‌వ‌స‌రంగా ప్రీమియం ఎక్కువ‌గా చెల్లించాల్సి వ‌స్తుంద‌ని రూ.500 కోసం క‌క్కుర్తి ప‌డ్డా. కానీ దుర‌దృష్టం వెంటాడింది. నా బైక్ పోయింది.”

“దీంతో నేను క‌ట్టిన ప్రీమియంకు అనుగుణంగా నాకు క్లెయిమ్ కింద రూ.50,000 చెల్లించారు. అదే వారు చెప్పిన‌ట్లు రూ.2300 క‌ట్టి ఉంటే నా బైక్ పోయింది క‌నుక నాకు రూ.70,000 వ‌చ్చేవి. రూ.500 కోసం చూసుకున్నా. నాకు రూ.20,000 న‌ష్టం వ‌చ్చిన‌ట్లు అయింది. అదే వారు చెప్పినంత మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఎక్కువ మొత్తంలో డ‌బ్బు వ‌చ్చేది. నేను అప్పుడు అలా చేసినందుకు చాలా బాధ‌ప‌డ్డా. కేవ‌లం రూ.500 కోసం రూ.20,000 న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని బాధ‌ప‌డ్డా. అందుక‌నే ఇన్సూరెన్స్‌ను అంత తేలిగ్గా తీసుకోకూడ‌దు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. పూర్తి స్థాయిలో వాహ‌నాల‌కు ఇన్సూరెన్స్ ఉంటేనే మంచిద‌ని త‌రువాత అర్థం అయింది.”

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment