వీడియో వైరల్.. పక్షి అనుకొని డ్రోన్ ను మింగిన మొసలి.. చివరికి ఏమైందంటే!

September 4, 2021 8:23 PM

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎన్నో పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోలను డ్రోన్ల సహాయంతో చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదివరకు మనం ఎప్పుడూ చూడని వింతైన, ఆశ్చర్యం కలిగించే వీడియోలను ప్రస్తుతం చూడగలుగుతున్నాము. ఇలా డ్రోన్ సహాయంతో ఓ వ్యక్తి నీటిలో ఉన్న మొసలిని చిత్రీకరిస్తున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ మొసలి వేటాడిన తీరుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వీడియో వైరల్.. పక్షి అనుకొని డ్రోన్ ను మింగిన మొసలి.. చివరికి ఏమైందంటే!

నీటిలో ఉన్న మొసలికి ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి దాని చేతికి దొరికామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ క్రమంలోనే మొసలి వేట మొదలు పెడితే ఎంతో చాకచక్యంగా కేవలం కనురెప్పపాటు కాలంలోనే ఇతర జంతువులు, మనుషులపై దాడి చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కూడా మొసలి ఈ విధంగానే వేటాడింది. అయితే అది వేటాడినది ఏ పక్షినో జంతువునో కాదు, ఒక డ్రోన్ ను.

https://youtu.be/gus5FMGtEok

ఫ్లోరిడాలో రికార్డు చేసిన వీడియోను డ్రోన్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ క్రిస్ ఆండర్సన్‌ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఇందులో డ్రోన్ సహాయంతో నీటిలో ఉన్న మొసలిని చిత్రీకరించాలని భావించాడు. ఈక్రమంలోనే డ్రోన్ మొసలి దగ్గర చక్కర్లు కొట్టడం జరిగింది. అయితే ఆ మొసలి ఏదైనా పక్షి అనుకుందో ఏమో కానీ కనురెప్ప పాటు కాలంలో తనపై ఎగురుతున్న డ్రోన్ ను ఒక్కసారిగా పట్టుకొని నమిలింది. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న మరొక వ్యక్తి కెమెరాలో షూట్ చేస్తున్నాడు. ఒక్కసారిగా మొసలి డ్రోన్ ను మింగడంతో దాని నోట్లో నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు మూగ జంతువుల దగ్గర ఇలాంటి ప్రయత్నాలు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment