వీడియో వైరల్.. అదృష్టం అంటే ఇదే.. రెప్పపాటు ఆలస్యమై ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి!

September 3, 2021 10:26 PM

కొన్నిసార్లు ఒక రెప్పపాటు క్షణంలో ఎన్నో ప్రమాదాలు జరగడం లేదా ప్రమాదాల బారి నుంచి బయటపడడం జరుగుతుంటుంది. ఈ విధంగా పెద్ద ప్రమాదం నుంచి రెప్పపాటుకాలంలో తప్పించుకున్న వారిని ఎంతో అదృష్టవంతులని, ఈ భూమిపై వారికి నూకలు ఉన్నాయని భావిస్తాము. ఈ విధమైన ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వీడియో వైరల్.. అదృష్టం అంటే ఇదే.. రెప్పపాటు ఆలస్యమై ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి!

ఈ వీడియోలో భాగంగా కొందరు యువకులు బ్రిడ్జి పై నుంచి కింద నీటిలోకి దూకుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఈ సంఘటనను వీడియోగా చిత్రీకరిస్తున్నారు. మొదటి కుర్రాడు నీటిలోకి దూకగానే వెంటనే ఇంకొక యువకుడు ఆ నీటిలోకి దూకాడు. అయితే రెండవ కుర్రాడు దూకిన కేవలం రెండు సెకండ్ల వ్యవధిలోనే ఆ కుర్రాడు దూకిన ఈ ప్రాంతంలోకి ఒక పెద్ద పడవ వచ్చింది. బ్రిడ్జ్ ఉండటం వల్ల ఆ కుర్రాళ్ళు పడవ రావడం గమనించలేదు.

https://www.instagram.com/p/CTRn50dKsV4/?utm_source=ig_web_copy_link

ఈ క్రమంలో ఆ కుర్రాడు ఒక రెండు సెకండ్ల పాటు ఆలస్యంగా దూకినా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి అతని ప్రాణాలు గాల్లో కలసిపోయేవి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు అదృష్టం బాగుంది.. భూమిపై ఇంకా నూకలు ఉన్నాయి.. అంటూ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment