విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్న బిగ్ బ్యాస్ బ్యూటీ.. డ్రెస్ విష‌యంలో నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. వీడియో..

September 3, 2021 11:12 AM

సెల‌బ్రిటీలు ధ‌రించే డ్రెస్సులు చాలా వ‌ర‌కు బాగానే ఉంటాయి. కానీ వారు కొన్ని సంద‌ర్భాల్లో ధ‌రించే దుస్తులే వివాదాల‌కు దారి తీస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఆ టీవీ న‌టి ధ‌రించిన డ్రెస్ కార‌ణంగా ఆమెను నెటిజ‌న్లు ఎడా పెడా విమ‌ర్శిస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్న బిగ్ బ్యాస్ బ్యూటీ.. డ్రెస్ విష‌యంలో నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. వీడియో..

టీవీ న‌టి ఉర్ఫి జావేద్ బిగ్‌బాస్ ఓటీటీ హౌజ్ నుంచి నిష్క్ర‌మించాక ఇంటికి వెళ్లే నిమిత్తం ఎయిర్‌పోర్టులో క‌నిపించింది. ఆమె డెనిమ్ జీన్స్‌లో త‌ళుక్కుమంది. దీంతో వెంట‌నే కొంద‌రు ఫొటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

https://www.instagram.com/p/CTRsZmdgKoZ/?utm_source=ig_embed&ig_rid=80b72d75-f974-4802-8261-7a7d880f0778

అయితే అంత వ‌ర‌కు బాగానే ఉంది, కానీ ఆమె ధ‌రించిన డ్రెస్ మ‌రీ అదో మాదిరిగా ఉండ‌డంతో నెటిజ‌న్లు త‌మ నోళ్ల‌కు ప‌ని చెప్పారు. ఆ విధంగా డ్రెస్ ధ‌రించినందుకు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు. చెత్త డ్రెస్ వేసుకున్నావ్‌, పైన పూర్తిగా క‌ప్పుకోవ‌డం మ‌రిచావ్‌.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఉర్ఫి జావేద్‌కు చెందిన ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఉర్పి జావేద్ అనేక పాపుల‌ర్ టీవీ షోల‌లో న‌టించింది. బ‌డే భ‌య్యా కి దుల్హ‌నియా, మేరీ దుర్గా, బెప‌న్న అండ్ పంచ్ బీట్ సీజ‌న్ 2 వంటి సీరియ‌ల్స్‌, సిరీస్ లో న‌టించింది. తాజాగా ఆమె బిగ్‌బాస్ ఓటీటీ హౌజ్ లోనూ పాల్గొంది. కొద్ది రోజుల పాటు ఉండి తాజాగా ఆమె ఆ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment