మెగాస్టార్ పెద్ద మనసు.. అభిమాని కూతురిని పదేళ్లుగా చదివిస్తున్న చిరంజీవి..!

August 31, 2021 8:09 PM

సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయం కూడా చేశారు. అయితే ఆయన చేసిన సహాయం బయటికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఆయన చేసిన సహాయాన్ని మాత్రం ఎవరూ మరిచిపోరు.

మెగాస్టార్ పెద్ద మనసు.. అభిమాని కూతురిని పదేళ్లుగా చదివిస్తున్న చిరంజీవి..!

 

మెగాస్టార్ అభిమాని డి సురేష్ 2010వ సంవత్సరంలో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబాన్ని పరామర్శించి అతని కూతురు అశ్వితను చదివించే బాధ్యత తనదని, ఆమె చదువు పూర్తయ్యే వరకు తన సొంత ఖర్చులతో చదివిస్తానని మాట ఇచ్చారు. ఈ విధంగా మెగాస్టార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

మెగాస్టార్ పెద్ద మనసు.. అభిమాని కూతురిని పదేళ్లుగా చదివిస్తున్న చిరంజీవి..!

ఈక్రమంలోనే అశ్వితను గత పది సంవత్సరాల నుంచి భారత సేవా సహకార ఫోరం అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్ ద్వారా చదివిస్తున్నారు. ప్రతియేటా అశ్విత స్కూల్ కి సంబంధించిన ఫీజులను చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదికి సంబంధించిన అశ్విత స్కూల్ ఫీజు పది వేల రూపాయల చెక్కును అందించడమే కాకుండా తను జీవితంలో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఈ సందర్భంగా మెగాస్టార్‌ కోరుకున్నారు. కేవలం ఇది మాత్రమే కాకుండా ఇలా ఎంతో మందికి సహాయం చేస్తూ ఎంతో గొప్ప మనసును మెగాస్టార్ చిరంజీవి చాటుకుంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now