చేతి వేళ్ల చివ‌ర్ల‌లో ఉండే ఆకృతుల‌కు అనుగుణంగా.. వ్య‌క్తుల మ‌న‌స్త‌త్వాలు ఎలా ఉంటాయో తెలుసా ?

August 31, 2021 3:53 PM

మ‌న స‌మాజంలో మ‌న చుట్టూ భిన్న ర‌కాల మ‌న‌స్త‌త్వాలు ఉన్న వ్య‌క్తులు ఉంటారు. కొంద‌రి ముఖం చూస్తేనే వారు ఎలాంటి వారో చెప్ప‌వ‌చ్చు. కానీ కొంద‌రి గురించి వివ‌రాలు తెలుసుకుంటే గానీ వారి గురించి చెప్ప‌లేం. అయితే ఏ వ్య‌క్తి మ‌న‌స్త‌త్వం అయినా స‌రే వారి చేతి వేళ్ల చివ‌ర్ల‌లో ఉండే ఆకృతుల‌ను బ‌ట్టి ఎలా ఉంటుందో చెప్పేయ‌వ‌చ్చు. అది ఎలాగంటే..

చేతి వేళ్ల చివ‌ర్ల‌లో ఉండే ఆకృతుల‌కు అనుగుణంగా.. వ్య‌క్తుల మ‌న‌స్త‌త్వాలు ఎలా ఉంటాయో తెలుసా ?

1. చిత్రంలో ఇచ్చిన‌ట్లుగా చేతి వేళ్ల చివ‌ర ఆకృతి రౌండ్ షేప్ లో ఉంటే వారు ఎల్లప్పుడూ ప్ర‌శాంత‌త‌ను కోరుకుంటారు. తాము చెప్పిన విష‌యాల‌ను ఇత‌రులు న‌మ్మ‌రేమో అన్న భ‌యం వారికి ఉంటుంది.

2. చేతి వేళ్ల చివ‌ర షార్ప్‌గా ఉంటే వారు అసాధార‌ణ రీతిలో ప‌నులు చేయాల‌ని కోరుకుంటారు. సాధార‌ణంగానే ప‌నులు చేసేందుకు ఇష్ట ప‌డ‌రు. ప్ర‌తి దాంట్లోనూ వెరైటీ ఉండాల‌ని ఆశిస్తారు.

3. చేతి వేళ్ల చివ‌ర ఆకృతి చ‌ద‌రంలా ఫ్లాట్‌గా ఉంటే వారు ఏ విష‌యంలోనైనా క‌చ్చితత్వం కోరుకుంటారు. అసంపూర్తిగా ఉంటే ఇష్ట ప‌డ‌రు. అన్నింటినీ ప‌ర్‌ఫెక్ట్‌గా చేయాల‌ని అనుకుంటారు.

4. చేతి వేళ్ల చివ‌ర ష‌వెల్ ఆకృతిలో ఉంటే వారు అత్యంత తెలివిక‌ల‌వారై ఉంటారు. ఏ విష‌యంలోనైనా ప్ర‌తిభ‌ను చూపిస్తారు. అత్యంత చ‌తుర‌త‌తో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటారు. ఇత‌రులు వెళ్లిన మార్గంలో ప్ర‌యాణించరు. త‌మ‌కై తాము కొత్త మార్గాలు, అవ‌కాశాల‌ను సృష్టించుకుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment