కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న కాజల్ అగర్వాల్.. ఫోటోలు వైరల్!

August 30, 2021 8:43 PM

వెండితెర చందమామగా గత 16 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో వెలిగిపోతున్న తార కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో, అద్భుతమైన నటనా నైపుణ్యంతో ఎన్నో సినిమా అవకాశాలు దక్కించుకుని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతోంది కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ గత ఏడాది అక్టోబర్ నెలలో తన చిన్ననాటి స్నేహితుడుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న కాజల్ అగర్వాల్.. ఫోటోలు వైరల్!

పెళ్లి తర్వాత కాజల్ ఇండస్ట్రీకి దూరం అవుతుందని అభిమానులు సందేహాలు వ్యక్తం చేసినా ఈమె మాత్రం పెళ్ళి తరువాత రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్కృ ష్ణాష్టమి సందర్భంగా ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంది. ఈ క్రమంలోనే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

https://www.instagram.com/p/CTL7YiPMGN6/?utm_source=ig_web_button_share_sheet

ఇక సినిమాల విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో మెగాస్టార్ సరసన నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదేవిధంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న “ది ఘోస్ట్” చిత్రంలో కాజల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు చిత్రాలలో కాజల్ నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment