రోడ్డు దాటిన భారీ అన‌కొండ‌.. ట్రాఫిక్ జామ్‌.. వైర‌ల్ వీడియో..!

August 25, 2021 11:26 AM

అట‌వీ ప్రాంతాల నుంచి వెళ్లే ర‌హ‌దారుల్లో స‌హజంగానే మ‌న‌కు వ‌న్య ప్రాణులు క‌నిపిస్తుంటాయి. అవి రోడ్డు దాటుతుంటాయి. అయితే కొన్ని సంద‌ర్భాల్లో అవి రోడ్డు దాటుతూ వాహ‌న‌దారుల‌కు క‌నిపించి భ‌యాన్ని క‌ల‌గ‌జేస్తాయి. ఈ క్ర‌మంలోనే అలా ఓ భారీ అన‌కొండ పాము రోడ్డు దాటుతూ క‌నిపించింది. దీంతో వాహ‌న‌దారులు ఆగి మ‌రీ దాన్ని చాలా ఆస‌క్తిగా చూశారు.

రోడ్డు దాటిన భారీ అన‌కొండ‌.. ట్రాఫిక్ జామ్‌.. వైర‌ల్ వీడియో..!

బ్రెజిల్‌లో ఓ చోట అట‌వీ ప్రాంతం నుంచి వెళ్తున్న ర‌హ‌దారిలో ఓ 10 అడుగుల అన‌కొండ క‌నిపించింది. అది రోడ్డుకు ఒక వైపు నుంచి ఇంకో వైపుకు దాటుతోంది. దీంతో ట్రాఫిక్ కాసేపు ఆగింది. అయితే దాన్ని చూసేందుకు వాహ‌న‌దారులు ఆగి మ‌రీ దాన్ని త‌మ కెమెరాల్లో బంధించే ప్ర‌య‌త్నం చేశారు.

https://www.instagram.com/p/CSzKMxPKfei/?utm_source=ig_embed&ig_rid=d423cc92-a70e-403d-82ff-53cca8092b7c

రోడ్డు దాటిన ఆ అన‌కొండ ఇంకో వైపుకు వెళ్లిపోయింది. అయితే ఆ స‌మ‌యంలో తీసిన వీడియోను ఓ యూజ‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయ‌గా అది వైర‌ల్‌గా మారింది. దానికి ఇప్ప‌టికే ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌, వేల‌ల్లో కామెంట్లు వ‌చ్చాయి.

సాధార‌ణంగా అన‌కొండ‌లు 250 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరుగుతాయి. 29 అడుగుల పొడ‌వు వ‌ర‌కు పెర‌గ‌గ‌ల‌వు. అయితే ఆ అన‌కొండ రోడ్డుపై క‌నిపించ‌డంతో దాన్ని చూసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment