ప్రిన్స్ ఫిలిప్ తయారుచేసిన ల్యాండ్ రోవర్ లోనే అతని అంతిమ యాత్ర..!

April 12, 2021 8:40 PM

క్వీన్ ఎలిజిబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ గత కొద్ది రోజుల క్రితం మృతి చెందిన సంగతి మనకు తెలిసినదే. అయితే ప్రిన్స్ ఫిలిప్ అంతక్రియలు ఏప్రిల్ 17న జరగనున్నాయి. ప్రిన్స్ అంత్యక్రియల కోసం అతని అంతిమ యాత్ర తాను ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్నా ల్యాండ్ రోవర్ లోనే అంతిమయాత్ర జరగాలని, అదే తనకు ఇచ్చే ఘనమైన నివాళి అని పలువురు పేర్కొన్నారు. ల్యాండ్ రోవర్ నుంచి ప్రిన్స్ ఫిలిప్ పార్థివదేహాన్ని యాత్రగా ఊరేగిస్తూ విండ్‌స‌ర్ క్యాజిల్ గార్డెన్స్‌కు త‌ర‌లించ‌నున్నారు.

ప్రిన్స్ ఫిలిప్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని 2005వ సంవత్సరం నుంచి తానే ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాన్ని ప్రిన్స్ స్వయంగా రీ డిజైన్ చేసుకున్నారు. రాజు కుటుంబ సేవల కోసం ఉపయోగించే డిఫరెంట్ 130 గున్ బస్సును ప్రిన్స్ మార్పులు చేశారు.ఫోలో స్పెష‌లిస్టు వెహికిల్స్ సంస్థ .. ప్రిన్స్ ఫిలిప్‌కు చెందిన ల్యాండ్ రోవ‌ర్ వాహనాన్ని రీడిజైన్ చేసింది.

ఏప్రిల్ 17వ తేదీన కేవలం ఎనిమిది నిమిషాల పాటు జరిగే ప్రిన్స్ ఫిలిప్ అంతిమ యాత్రలో భాగంగా ఈ వాహనంలో అతని పార్ధివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. ప్రిన్స్ అంతిమ సంస్కారాలకు కేవలం 30 మంది అతిథులు మాత్రమే అవకాశం కల్పించారు.ప్రిన్స్ చార్లెస్‌, ప్రిన్స్ హ్యారీలు అంతిమ వీడ్కోల్లో పాల్గొంటారు

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment