పక్కింటి వారి చెట్ల‌కు పూసిన పువ్వుల‌తో పూజలు చేయవచ్చా ? పుణ్యం ఎవరికి వస్తుంది ?

January 19, 2022 6:43 PM

రోజూ ఉదయమే చాలా మంది పూజల కోసం పక్క వాళ్ల ఇంట్లో ఆవరణలో ఉండే మొక్కలకు పూసిన పువ్వులను కోస్తూ కనిపిస్తుంటారు. కొందరు వాకింగ్‌ అని వెళ్తూ మధ్యలో ఎక్కడ పూలు కనపడ్డా కోస్తుంటారు. వాటిని ఇంటికి తెచ్చి వాటితో పూజలు చేస్తుంటారు. అయితే ఇలా పక్క వాళ్ల పూలతో పూజలు చేయవచ్చా ? దాంతో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి ? అంటే..

పక్క వారి పూలతో పూజలు చేయవచ్చా ? పుణ్యం ఎవరికి వస్తుంది ?

మొక్కలకు యజమానులు అయినా సరే వారు తమ మొక్కలకు చెందిన పువ్వులను పూర్తిగా కోసే అధికారం లేదు. దేవుడి పూజ కోసమని మొక్కను ముందుగా ప్రార్థించాలి. తరువాత కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. అన్నీ పూలను కోసేసి బోసి మొక్కల్లా ఉంచరాదు. అది మహా పాపం కిందకు వస్తుంది.

ఇక పక్క వాళ్లను అడగకుండా పూలను కోయడం దొంగతనం కిందకు వస్తుంది. అందుకు శిక్షగా మళ్లీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. అందువల్ల పువ్వులను కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఇక యజమానులు ఒప్పుకున్నా వారి మొక్కలకు చెందిన పువ్వులను కోసి వాటితో పూజలు చేస్తే అప్పుడు కలిగే పుణ్యంలో సగం పుణ్యం ఆ పువ్వులకు చెందిన యజమానులకు పోతుంది.

కనుక పక్కవాళ్ల మొక్కలకు చెందిన పువ్వుల కన్నా మన ఇంట్లో మన మొక్కలకు పూసిన పువ్వులతో పూజలు చేస్తే మేలు. ఈ విషయాలను సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడునికి వివరించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment