మెగాస్టార్ సినిమాలో శృతి హాసన్‌ ?

August 16, 2021 10:07 PM

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శృతి హాసన్ కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ, రవితేజ నటించిన “క్రాక్” సినిమా ద్వారా మరోసారి ఫామ్ లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆమె వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉంది. తాజాగా శృతి హాసన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తుస్తోంది. ఈ క్రమంలోనే శృతిహాసన్ గతంలో మెగా కాంపౌండ్ లో ముగ్గురు హీరోల సరసన నటించింది. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచాయి.

మరోసారి మెగా కాంపౌండ్‌లో మరొక స్టార్ హీరోతో నటించి మరోసారి సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకోబోతుందని తెలుస్తోంది. తమిళంలో అజిత్ నటించిన “వేదాళం” సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేయనున్నారు.

రమేష్ మెహర్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో శృతి హాసన్ నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

శృతి హాసన్ ను దర్శకుడు కలిసి ఆమెతో సంప్రదింపులు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ నటిస్తుందా ? లేదా అనే విషయం గురించి మరి కొద్ది రోజులలో క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్ర ఎంతో కీలకమైనదని, ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now