మేక పిల్ల‌ల‌న్నీ బుద్ధిగా పాలు తాగుతున్న వీడియో.. షేర్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా..!

April 11, 2021 3:08 PM

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్రా ఎప్ప‌టిక‌ప్పుడు ఆక‌ట్టుకునే వీడియోల‌ను షేర్ చేస్తుంటారు. అందులో భాగంగానే ఆయ‌న తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. కొన్ని మేక‌ల‌న్నీ క‌ల‌సి పాలు తాగుతున్న వీడియో అది. దాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

goat babies drinking milk viral video shared by anand mahindra

ఆ వీడియోలో ఒక వ్య‌క్తి పాలతో నిండిన బాటిల్స్‌ను తెచ్చి ఒక స్టాండ్‌లో వ‌రుస‌గా పెట్ట‌గానే అక్క‌డే ఉన్న మేక పిల్ల‌లు అన్నీ ఆ బాటిల్స్‌లోని పాల‌ను తాగ‌డం ప్రారంభించాయి. అయితే కొన్ని మేక‌ల‌కు బాటిల్స్ అంద‌క‌పోవ‌డంతో ఆ వ్య‌క్తి వాటిని తీసి ప‌క్క‌నే ఉన్న ఇంకొన్ని బాటిల్స్ వ‌ద్ద ఉంచాడు. ఈ క్ర‌మంలో మేక‌ల‌న్నీ తోకలు ఊపుతూ భ‌లే స‌ర‌దాగా పాల‌ను తాగ‌డం ప్రారంభించాయి.

ఆనంద్ మ‌హీంద్రా ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేయ‌డంతో దానికి ఇప్ప‌టికే 1.70 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఎంతో మంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. ర‌క ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. చూడ‌బోతే ఇది ఓ సింపుల్ వీడియో లాగే ఉంది. కానీ ప్ర‌పంచం దీని ద్వారా ఒక శ‌క్తి రూపాన్ని సృష్టించ‌వ‌చ్చు.. అని ఆనంద్ మ‌హీంద్రా ఆ వీడియోకు కామెంట్ పెట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment