ల్యాప్‌టాప్ కొనేముందు చెక్ చేయాల్సిన ఫీచ‌ర్లు ఏమిటో తెలుసా ?

August 15, 2021 7:53 PM

క‌రోనా వ‌ల్ల ప్ర‌స్తుతం చాలా మంది ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల‌కు, ఉద్యోగులు ప‌నికి ల్యాప్‌టాప్‌ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. దీంతో గత ఏడాది కాలంగా ల్యాప్‌టాప్ ల కొనుగోళ్లు ఎక్కువ‌య్యాయి. అయితే ల్యాప్‌టాప్‌ల‌ను కొనాల‌ని అనుకుంటున్న వారు ముందుగా చెక్ చేయాల్సిన ఫీచ‌ర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ల్యాప్‌టాప్ కొనేముందు చెక్ చేయాల్సిన ఫీచ‌ర్లు ఏమిటో తెలుసా ?

ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకునే వారు దాన్ని ఏవిధంగా, ఏ ప‌నికి వాడాల‌నుకుంటున్నారో ముందుగా తెలుసుకోవాలి. సాధార‌ణ ప‌నుల‌కు అయితే నార్మ‌ల్ ల్యాప్‌టాప్ స‌రిపోతుంది. అదే వీడియోల ఎడిటింగ్‌, గ్రాఫిక్స్‌, డిజైనింగ్ అయితే గ్రాఫిక్ కార్డు ఉన్న ల్యాప్‌టాప్‌ను తీసుకోవాలి. ఈ క్ర‌మంలో క‌నీసం 4జీబీ కెపాసిటీ ఉన్న గ్రాఫిక్ కార్డు ఉండేలా ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి. దీంతో గ్రాఫిక్స్, ఎడిటింగ్ ప‌ని సుల‌భత‌రం అవుతుంది. ఇక సాధార‌ణ ప‌నుల‌కు గ్రాఫిక్ కార్డు అవ‌స‌రం లేదు. నార్మ‌ల్ ల్యాప్ టాప్ కొంటే చాలు.

సాధార‌ణంగా ల్యాప్‌టాప్‌లో ఐ5 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్ క‌నీసం ఉండేలా చూసుకోవాలి. దీంతో ల్యాప్‌టాప్ వేగంగా ప‌నిచేస్తుంది. అలాగే క‌నీసం 128జీబీ ఎస్ఎస్‌డీ అయినా ఉండేలా చూసుకోవాలి. ఎస్ఎస్‌డీ అంటే ఓ ర‌కమైన హార్డ్ డిస్క్. ఇందులో విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ లోడ్ అవుతుంది. సాధార‌ణ హార్డ్ డిస్క్ క‌న్నా ఎస్ఎస్‌డీ వేగంగా ప‌నిచేస్తుంది. క‌నుక ల్యాప్‌టాప్‌లో హార్డ్ డిస్క్‌తోపాటు ఎస్ఎస్‌డీని కూడా అందిస్తారు. ఎస్ఎస్‌డీలో విండోస్ సి డ్రైవ్ ఉంటుంది. మిగిలిన డ్రైవ్‌లు మ‌న‌కు హార్డ్ డిస్క్‌లో ఉంటాయి.

ల్యాప్‌టాప్ కొనేముందు చెక్ చేయాల్సిన ఫీచ‌ర్లు ఏమిటో తెలుసా ?

ఎస్ఎస్‌డీ వ‌ల్ల ల్యాప్‌టాప్ వేగంగా ప‌నిచేస్తుంది. క‌నుక క‌నీసం 128జీబీ ఎస్ఎస్‌డీ ఉండేలా ల్యాప్‌టాప్ తీసుకోవాలి. దీంతో ప‌నిచేసే సాఫ్ట్‌వేర్లు వేగంగా ఉంటాయి.

ల్యాప్‌టాప్ కాన్ఫిగ‌రేష‌న్ కింద చెప్పిన విధంగా ఉంటే మేలు. ఇది క‌నీస కాన్ఫిగ‌రేష‌న్‌. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప‌నిచేసుకోవ‌చ్చు. బ‌డ్జెట్ ఉంద‌నుకుంటే ఇంత‌క‌న్నా ఎక్కువ కాన్ఫిగ‌రేష‌న్‌తో ల్యాప్‌టాప్ కొన‌వ‌చ్చు.

ల్యాప్‌టాప్‌కు ఉండాల్సిన కనీస కాన్ఫిగ‌రేష‌న్

  • ప్రాసెస‌ర్ – కోర్ ఐ5
  • ర్యామ్ – 8 జీబీ
  • ఎస్ఎస్‌డీ – 128 జీబీ
  • హార్డ్ డిస్క్ – 1 టీబీ
  • గ్రాఫిక్ కార్డ్ – 4జీబీ (ఎడిటింగ్, గ్రాఫిక్ వ‌ర్క్ చేస్తేనే అవ‌స‌రం, లేదంటే అవ‌స‌రం లేదు)

ఈ విధంగా కాన్ఫిగ‌రేష‌న్ ఉండేలా ల్యాప్‌టాప్ ను తీసుకుంటే వేగంగా ప‌నిచేసుకోవ‌చ్చు. గ్రాఫిక్ కార్డులు ఉన్న ల్యాప్‌టాప్‌లు ఎక్కువ ధ‌ర‌ను క‌లిగి ఉంటాయి. సాధార‌ణ ల్యాప్‌టాప్‌లు ధ‌ర త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక ఈ రెండు ర‌కాల్లో ఏది అవ‌స‌ర‌మో తెలుసుకుని త‌రువాత ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment