దారుణం.. చిన్నారి చేతి మెడ నరాలు కోసి హత్య చేసిన తల్లి..

August 13, 2021 10:44 PM

కన్న బిడ్డను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన ఆ తల్లి కన్నబిడ్డ పట్ల హంతకురాలుగా మారింది.పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అన్న మమకారం కూడా లేకుండా ఆ బిడ్డపట్ల కర్కశంగా ప్రవర్తించింది ఆ కసాయి తల్లి.ఆవేశంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్న ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లా ధర్మవరంలోని కొత్త పేటలో నివసిస్తున్నటువంటి మీనాక్షి, శ్రీనివాసులు దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శ్రీనివాసులు చేనేత పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య తరచూ గొడవలు జరగడంతో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో విసిగిపోయిన మీనాక్షి ఆత్మహత్య చేసుకోవాలనే భావించింది.ఈ క్రమంలోనే శ్రీనివాస్ బయటకు వెళ్ళగా తన పెద్ద కూతురు తనుశ్రీ బయట పిల్లలతో ఆడుకుంటుంది.

ఇక రెండున్నర సంవత్సరాల ప్రణతి ఇంటిలో ఉండగా తన చేతిపై మెడపై కత్తితో దాడి చేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది.ఈ క్రమంలోనే చిన్నారి అక్కడే మరణించగా ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని శ్రీనివాసులకు తెలియజేయడంతో శ్రీనివాసులు అక్కడికి చేరుకొని తన భార్యను ఆస్పత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ ఘటనా స్థలానికి చేరుకొని విచారించగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగానే ఈ ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment