ప్లే గ్రౌండ్ లో ఎవరూ ఊహించని ఘటన.. ఈ విషయం తెలిసి షాకైన జనం..!

August 13, 2021 11:57 AM

సాధారణంగా మైదానంలో ఎంతో రసవత్తరంగా ఆట జరిగేటప్పుడు చాలామంది ఎంతో ఉత్కంఠభరితంగా ఆ ఆటను వీక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు అత్యుత్సాహంతో గ్రౌండ్ లో కి పరుగులు పెడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉంటాము. అయితే అభిమానం లేదా నిరసనను తెలుపుతూ కొందరు ఈ విధంగా గ్రౌండ్ లోకి వెళ్లడం మనం చూస్తుంటాము.కానీ ఇక్కడ ఓ బుడ్డోడు మాత్రం తన అల్లరి చేష్టలు చిలిపి పనులతో మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

సిన్‌సిన్నాటి, ఓర్లాండో మధ్య ఎంతో రసవత్తరంగా ఫుట్ బాల్ గేమ్ జరుగుతుండగా మూడు సంవత్సరాల పిల్లవాడు తన తల్లి ఒడిలో నుంచి ఒక్క దూకు దూకి మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అప్పటి వరకు ఆట చూడటంలో నిమగ్నమైపోయాను ఆ తల్లి తన కొడుకు మైదానంలోకి ప్రవేశించడం చూసి ఏమాత్రం ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి బారికేడ్లను దూకి ఆ పిల్లాడిని పట్టుకొని సిబ్బంది సహాయం లేకుండా అక్కడి నుంచి బయటకు వచ్చింది.

ఈ క్షణంలోనే అక్కడున్న జనాలు ఆ తల్లిని పిల్లాడిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే ఈ వీడియోను మేజర్‌ లీగ్‌ సాకర్‌ ట్విటర్‌ పేజ్ సరదాగా ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment