క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నా కొంద‌రికి కోవిడ్ సోకుతోంది.. ఎందుకు..?

April 10, 2021 11:47 AM

దేశ‌వ్యాప్తంగా మూడో ద‌శ కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం చురుగ్గా కొన‌సాగుతోంది. 45 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు పైబ‌డిన వారికి టీకాల‌ను ఇస్తున్నారు. అయితే ప‌లు రాష్ట్రాలు టీకాల నిల్వ‌లు త‌గ్గుతున్నాయ‌ని, వెంట‌నే డోసుల‌ను పంపాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశాయి. ఈ క్ర‌మంలో స్పందించిన కేంద్రం టీకాల‌ను అయిపోయిన వెంట‌నే రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసింది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ల‌ను తీసుకున్న‌ప్ప‌టికీ కొంద‌రికి క‌రోనా సోకుతోంది. ఇలా ఎందుకు జ‌రుగుతుందో నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

why some getting covid infection despite taking vaccine

కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నా కొంద‌రికి కోవిడ్ సోక‌డంపై వైద్య నిపుణులు ప‌లు కార‌ణాల‌ను చెబుతున్నారు. వ్యాక్సిన్ స‌రిగ్గా వేయ‌క‌పోయినా, నిర్ణీత డోసు వేయ‌క‌పోయినా, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్నా కోవిడ్ సోకుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ ఈ సంద‌ర్భాల్లో కోవిడ్ సోకేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

ఇక ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఏ కోవిడ్ వ్యాక్సిన్ కూడా 100 శాతం కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ‌ను అందించ‌వు. అందువ‌ల్ల కూడా కోవిడ్ టీకాల‌ను తీసుకున్న త‌రువాత కొంద‌రు కోవిడ్ బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక వ్యాక్సిన్ తీసుకునేందు క‌న్నా ముందుగానే ఎవ‌రికైనా కోవిడ్ ఉంటే వ్యాక్సిన్ తీసుకుని కూడా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అలాంటి వారు కోవిడ్ తగ్గాక వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇలాంటి సంద‌ర్భాల్లో కూడా కోవిడ్ టీకాల‌ను తీసుకున్న త‌రువాత కోవిడ్ సోకుతోంది. అయితే టీకా తీసుకున్న త‌రువాత కూడా క‌రోనా జాగ్ర‌త్తల‌ను పాటించ‌డం వ‌ల్ల కోవిడ్ సోక‌కుండా ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment