పెళ్లిలో స్నేహితులు ఇచ్చిన బహుమతి చూసి షాక్ అయిన వధువు.. ఏమిచ్చారంటే!

August 10, 2021 6:00 PM

సాధారణంగా పెళ్లి వేడుకలు జరిగితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తరఫున స్నేహితులు ఎంతోమంది వివాహానికి హాజరవుతారు. ఈ క్రమంలోనే పెళ్లి కూతురు పెళ్లి కొడుకును ఆటపట్టించడం కోసం స్నేహితులు చిలిపి చేష్టలు చేయడం మనం చూస్తూనే ఉంటాము.తాజాగా ఓ పెళ్లిలో కూడా స్నేహితులు ఇలాంటి చిలిపి పని చేయడంతో అక్కడున్న వారందరూ నవ్వుకోగా వధువు మాత్రం కొంతమేర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా వధూవరులిద్దరూ పెళ్ళి తర్వాత వేదికపై నిలబడి ఉండగా బంధువులు స్నేహితులు అందరూ వచ్చి వారికి కానుకలు ఇస్తూ ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వరుడు స్నేహితులు స్టేజ్ పైకి వచ్చి వారు తీసుకువచ్చినటువంటి విచిత్ర బహుమతిని వారికి అందజేశాడు.అయితే ఆ బహుమతిని చూసిన వధువు కొద్దిగా కోపంతో మొహం పక్కకి తిప్పుకోగా అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు.                                                                                                                                                                                                                                సాధారణంగా ఏదైనా దేవతావిగ్రహాలు లేదా ఏదైనా వస్తువులను కానుకగా తెస్తాము. కానీ ఆ స్నేహితుడు మాత్రం పాలసీసాను బహుమతిగా ఇవ్వడంతో వధువు కోపంతో మొహం పక్కకి తిప్పుకోగా అక్కడున్న వారందరూ ఎంతో నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/CSM4jnHl8kN/?utm_source=ig_web_copy_link

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment