కళ్ళముందే కూలిపోయిన హోటల్ భవనం..!

August 9, 2021 9:36 PM

ఉత్తరాఖండ్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు నదులు పొంగిపోర్లడంతో జనజీవనం స్తంభించిపోయింది.గత కొద్ది రోజుల క్రితం వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడగా తాజాగా అధిక వర్షాల కారణంగా ఓ భవంతి నేలమట్టమైంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లోని ఝాడ్కుల సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్ భవంతి ఉంది. అయితే ఈ భవనం పక్కనే ఒక పెద్ద లోయ ఉంది. వర్షం కారణంగా మట్టికొట్టుకు పోవడంతో భవనం ప్రమాదస్థాయికి చేరుకుంది.ఈ క్రమంలోనే భవనం కూలిపోతుందని ముందుగా గ్రహించిన నిర్వాహకులు అందులో ఉన్నటువంటి ప్రజలను సురక్షితంగా బయటకు పంపించారు.                                                                                                                                                                                           ఈ వి ధంగా హోటల్లో ఉన్న వారిని బయటకు పంపించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే లోయ కారణంగా మట్టికొట్టుకు పోవడం వల్లే ఆ భవనం కుప్పకూలి పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం ఆగిపోయింది.ఈ క్రమంలోనే కొండచరియలు విరిగిపడటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అని అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment