మ‌రో రికార్డు సాధించిన సాయిప‌ల్ల‌వి పాట‌..!

August 8, 2021 6:00 PM

న‌టిగా సాయిప‌ల్ల‌వి ఎంత‌టి పేరు తెచ్చుకుందో అంద‌రికీ తెలిసిందే. ఆమె డ్యాన్స్‌కు కూడా చాలా మంది ఇప్ప‌టికే ఫిదా అయ్యారు. ఇక శేఖ‌ర్ క‌మ్ముల తాజా చిత్రం ల‌వ్‌స్టోరీలోని సారంగ ద‌రియా.. అనే పాట‌లో సాయిప‌ల్ల‌వి మరోమారు త‌న డ్యాన్స్‌తో అల‌రించింది. ఈ పాట‌కు చెందిన లిరిక‌ల్‌ వీడియోను ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన విడుద‌ల చేయ‌గా.. ఆ పాట మ‌రో రికార్డును సృష్టించింది.

sai pallavi saranga dariya song another record 30 crore views

సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం, శేఖర్‌ కమ్ముల ద‌ర్శ‌క‌త్వం, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ లో ఈ పాట‌ను రూపొందించారు. దీనికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ పాట విడుద‌లైన నెల రోజుల్లోనే 10 కోట్ల వీక్ష‌ణ‌ల‌ను ద‌క్కించుకుని రికార్డు సృష్టించింది.

అయితే ఈ పాటకు తరువాత త‌క్కువ వ్య‌వ‌ధిలోనే 25 కోట్ల వ్యూస్ వ‌చ్చాయి. ఇక తాజాగా 30 కోట్ల వ్యూస్ మార్కును ఈ పాట దాటింది. ద‌క్షిణాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే లిరిక‌ల్ వీడియోకు కూడా ఇలాంటి స్థాయిలో స్పంద‌న రాలేదు. వ్యూస్ ల‌భించ‌లేదు.

ఇక కోవిడ్ కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల ఆల‌స్యం అవుతోంది. ఇందులో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌విలు న‌టిస్తున్నారు. ఈ మూవీ విడుద‌ల తేదీని అనౌన్స్ చేయాల్సి ఉంది. మ‌రోవైపు దీన్ని ఓటీటీలో విడుద‌ల చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment