నేడు శ్రావణమాస అమావాస్య.. ఆ దోషంతో బాధపడే వారికి విముక్తి!

August 8, 2021 12:24 PM

మన హిందూ క్యాలెండర్ ప్రకారం నేడు శ్రావణ మాస అమావాస్య. ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.ఈ అమావాస్య రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు సూర్యభగవానుడు పుష్యమి నక్షత్రం లో ఉంటాడు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.ఈ విధంగా సూర్యుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న సమయంలో తెల్లజిల్లేడు చెట్టుకు పూజ చేయడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

ఈ అమావాస్య శనివారం రాత్రి ప్రారంభమయ్యే ఈ ఆదివారం రాత్రి 07:19 వరకు అమావాస్య తిథి ఉంటుంది.ఈ అమావాస్య రోజు సూర్యుడు పుష్యమి నక్షత్రంలో ఉండటం వల్ల ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకమైనదని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజు ఏ విధమైనటువంటి దోషాలు ఉన్న వారైనా ఈరోజు ప్రత్యేక పూజలను చేయడం వల్ల ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కాలసర్ప దోషం ఉన్నవారు పూజలు చేయటం వల్ల కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందవచ్చును పండితులు చెబుతున్నారు.

అదే విధంగా ఈ అమావాస్యను పురస్కరించుకుని పితృదేవతలను స్మరించుకోవాలి. ఈ విధంగా పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుందని పండితులు చెబుతున్నారు.అదే విధంగా మరికొన్ని ప్రాంతాలలో ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకమైన రోజుగా భావించి పెద్దఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment