దారుణం.. కలకలం రేపిన పరువు హత్య.. కులాంతర వివాహం నచ్చక..

August 7, 2021 10:13 PM

తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం రేపిన సంగతి మనకు తెలిసిందే. కేవలం కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంగా అమృత తల్లిదండ్రులు నడిరోడ్డుపై అతి దారుణంగా చంపిన ఘటన ఇప్పటికీ అందరి కళ్ల ముందు కదులుతోంది. ఇదిలా ఉండగానే ఉత్తరప్రదేశ్లో మరో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న కారణంతోనే వధువు తల్లిదండ్రులు వరుడిని అతి కిరాతకంగా చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

గోరఖ్‌పూర్‌కు చెందిన అనీష్ కుమార్ చౌదరి, దీప్తి మిశ్రా అనే యువతి యువకులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లి విషయం పెద్దల ముందు తెలపడంతో దీప్తి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే అనీష్ దీప్తి తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.దీంతో తమ ఇంటి పరువు పోయిందని భావించిన దీప్తి కుటుంబ సభ్యులు పెళ్లి జరిగిన మూడు నెలల వరకు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డారు.

ప్లాన్ ప్రకారమే కొద్ది రోజుల క్రితం నడిరోడ్డుపై వెళ్తున్న అటువంటి అనీష్ కుమార్ ను దీప్తి తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. తన భర్త చావుకు కారణం తన తల్లిదండ్రులేనని దీప్తి చేసిన ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనీష్, దీప్తి ఇద్దరు ఉన్నత చదువులు చదివి ఇద్దరు గ్రామపంచాయతీ అధికారులుగా ప్రభుత్వ కొలువులను సాధించారు. ఇద్దరూ ఒకే చోట పని చేయటం వల్ల వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్న వీరి జీవితంలో ఇలాంటి ఘటన ఎదురైందని దీప్తి కన్నీరుమున్నీరయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment