వీడియో వైరల్: 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్పించే మొక్కలు.. ఎక్కడో తెలుసా ?

August 5, 2021 10:26 PM

సాధారణంగా పువ్వులు చూడటానికి ఎంతో ఆకర్షణగా ఉంటాయి.ఎంతో కలవరపడుతున్నా మనసుకి కూడా పువ్వులు ఎంతో ప్రశాంతతను కల్పిస్తాయి. పువ్వులు ప్రకృతికి అందాన్ని కూడా తెచ్చిపెడతాయని చెప్పవచ్చు. అయితే ఈ ప్రకృతిలో ఎంతో అందమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటి పుష్పాలు పుష్పిస్తే వాటిని చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఉబలాటపడతారు.మరి ఈ విధంగా 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పుష్పించే ఈ పుష్పాలను చూడటానికి పర్యాటకులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుంటారు.ఇలా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కనువిందు చేసే పుష్పాలను నీలకురింజి పుష్పాలు అని పిలుస్తారు.

కేరళలోని శాంతన్‌పర షలోమ్ హిల్స్‌లో ఈ పువ్వులు వికసించాయి.స్ట్రోబిలాంథెస్ కుంతియానస్ అనే శాస్త్రీయ నామం కలిగినటువంటి ఈ పుష్పాలు జూలై నుంచి అక్టోబర్ నెల మధ్యలో వికసిస్తాయి.ఈ విధంగా పన్నెండేళ్ళకొకసారి పుష్పించే ఈ పువ్వులను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు.

తాజాగా ఏఎన్‌ఐ ఇటీవల సంతన్‌పారా పంచాయితీలోని అందమైన కొండలలో పువ్వులు వికసించి గాలికి కదులుతూ ఉన్నటువంటి ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.అదేవిధంగా ఈ పుష్పాల నుంచి సేకరించే తేనె ఎన్నో రకాల వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ పుష్పాల నుంచి సేకరించే తేనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ నీలికురుంజి పుష్పాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment