ఎమ్మెల్యే రోజాపై పూల వ‌ర్షం.. అభిమానం చూపిన నేత‌లు.. వీడియో..

August 4, 2021 3:10 PM

ఎమ్మెల్యే, న‌టి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు రోజా ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఆమెకు గ‌తంలో ప్ర‌జలు పూల‌తో స్వాగ‌తం చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా దాదాపుగా అదే విధంగా ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు. ఆమెపై నేత‌లు పూల‌వ‌ర్షం కురిపించారు.

ysrcp leaders flowers rain on mla roja

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన విష‌యం విదిత‌మే. వాటిలో కొన్ని కీలకమైన కార్పొరేషన్ల ఛైర్మన్లను తొలగించింది. ఇందులో భాగంగా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా ఉన్న‌ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తప్పించారు. దీంతో ఈ విష‌యం సంచలనంగా మారింది. అయితే ఆ ప‌ద‌వి పోయిన‌ప్ప‌టికీ ఆమె త‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు.

ఇక తాజాగా రోజా వడమాలపేట మండలంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. ఈ క్ర‌మంలో స్థానికంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆమెను స‌న్మానించారు. ఆమెపై రోజా పూలతో వ‌ర్షం కురిపించారు. అయితే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now