దొంగగా మారిన కానిస్టేబుల్.. ఏకంగా రూ.25 లక్షల దోపిడీ..

August 4, 2021 12:28 PM

ఒక ప్రభుత్వ కొలువులో ఉంటూ సామాజిక బాధ్యతలు నిర్వహించాల్సిన ఉద్యోగి తన విధుల పట్ల తప్పుడు మార్గం ఎంచుకుంది. సమాజానికి సేవ చేయాల్సింది పోయి.. సమాజానికి ద్రోహం చేస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ పట్టుబడింది. ఈ క్రమంలోనే ఆమెను విచారించగా సుమారు పాతిక లక్షల వరకు దోపిడీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇంతకీ మహిళా కానిస్టేబుల్ ఏం చేసింది..? ఏంటి ?అనే విషయాల గురించి తెలుసుకుందాం.

police constable theft of rs 25 lakhs మహారాష్ట్రలోని వసాయి పోలీస్‌ స్టేషన్‌లో స్టోర్‌ క్లర్క్‌గా మంగళ్ గైక్వాడ్‌ అనే మహిళ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ కారణాల వల్ల సీజ్ చేయబడిన వాహనాలను, వాటి నగదుకు సంబంధించిన విషయాలను రికార్డు చేయడం ఆమె పని. ఈ క్రమంలోనే ఆమె బాధ్యతలను మరిచి దొంగదారిని ఎంచుకుంది. ఈ క్రమంలోనే స్క్రాప్ డీలర్ ముస్తాక్‌ తో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా వాహనాలను వస్తువులను బేరానికి పెట్టి డబ్బులు పోగు చేసుకునేది.

ఈ క్రమంలోనే సదరు హెడ్ కానిస్టేబుల్ పై అనుమానాలు రావడంతో పోలీసులు తనపై నిఘా ఉంచి గైక్వాడ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే సదరు హెడ్ కానిస్టేబుల్ సుమారు పాతిక లక్షల వరకు వస్తువులను దొంగిలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సదరు కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఈ విధంగా దొంగ దారులు వెతుక్కుంటే ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment