వామ్మో.. ఈ బాలుడి షుగ‌ర్ లెవ‌ల్స్ 1206.. ఏకంగా రోజుకు 40 చ‌పాతీలు తింటున్నాడు..

August 2, 2021 8:01 PM

సాధార‌ణంగా శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ఎక్కువ‌గా ఉంటే ఎవ‌రికైనా స‌రే అతి దాహం, ఆక‌లి క‌లుగుతాయి. దీంతో షుగ‌ర్‌ను నియంత్రించుకునేందుకు మందుల‌ను వాడుతారు. అయితే ఆ బాలుడికి ఈ విష‌యం తెలియ‌దు. దీంతో అత‌ను త‌న‌కు షుగ‌ర్ ఉంద‌ని తెలియ‌క‌పోవ‌డంతో రోజుకు ఏకంగా 40 చ‌పాతీలు తిన్నాడు. చివ‌ర‌కు హాస్పిట‌ల్ పాల‌య్యాడు. వివ‌రాల్లోకి వెళితే..

this boy has 1206 sugar know what happened next

మ‌ధ్య‌ప్ర‌దేశ్లోని గ్వాలియ‌ర్‌కు చెందిన 12 ఏళ్ల సందీప్ అనే బాలుడు ఉన్న‌ట్లుండి రోజుకు 40 చపాతీలు తిన‌డం మొద‌లు పెట్టాడు. స‌డెన్ గా కంటి చూపు పోయింది. ఒక రోజు అత‌ను స్పృహ త‌ప్పి ప‌డిపోయాడు. దీంతో తండ్రి బ‌న్వ‌రి అత‌న్ని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాడు. వైద్యులు ప‌రీక్ష‌లు చేయ‌గా ఆ బాలుడికి షుగ‌ర్ 1206 ఉన్నట్లు వ‌చ్చింది. దీంతో వైద్యులే షాక‌య్యారు.

అయితే ఆ బాలుడికి రోజుకు 6 యూనిట్ల ఇన్సులిన్ ను ఇచ్చారు. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లోకి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో అత‌ను స్పృహ‌లోకి వ‌చ్చాడు. అయితే షుగ‌ర్ ఎక్కువ కావ‌డం వ‌ల్ల కంటి చూపు పోయింది. దీంతో వైద్యులు అత‌నికి శ‌స్త్ర చికిత్స చేశారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి బాగానే ఉంద‌ని చెప్పారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment