ఐపీఎల్ 2021 మ్యాచ్‌ల‌ను ఉచితంగా వీక్షించాలంటే.. ఇలా చేయండి..!

April 8, 2021 1:36 PM

క‌రోనా వ‌ల్ల ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ గతేడాది ఆల‌స్యంగా జ‌రిగింది. అయితే ఈసారి మాత్రం అనుకున్న తేదీల‌కే మ‌న దేశంలోనే నిర్వ‌హిస్తున్నారు. ఇంకొన్ని గంట‌ల్లోనే ఐపీఎల్ 14వ ఎడిష‌న్ ప్రారంభం కానుంది. దీంతో అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌ల‌‌ను హాట్ స్టార్ త‌న యాప్‌లో ప్ర‌త్యక్ష ప్ర‌సారం చేస్తుంద‌నే సంగ‌తి తెలిసిందే. కానీ ఆ యాప్‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫీజు చెల్లించాలి. అయితే ఎలాంటి ఫీజు చెల్లించ‌కుండానే ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను చూడ‌వ‌చ్చు. అదెలాగంటే…

watch ipl 2021 matches for free do this

జియో, ఎయిర్‌టెల్‌, వి, జియో ఫైబ‌ర్‌, జియో పోస్ట్ పెయిడ్ ప్ల‌స్‌, టాటా స్కై, ఫ్లిప్‌కార్ట్ క‌స్ట‌మ‌ర్లు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఉచితంగానే వీక్షించ‌వ‌చ్చు. అందుకు గాను వారికి ఉచితంగా హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. దాన్ని పొందేందుకు వారు ఆయా కంపెనీలు నిర్దేశించిన విధంగా ప్లాన్‌ల‌ను రీచార్జి చేసుకోవాలి. పోస్ట్‌పెయిడ్ అయితే అధిక విలువ క‌లిగిన ప్లాన్‌ను తీసుకోవాలి. దీంతో హాట్‌స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది.

హాట్‌స్టార్‌లో రెండు ర‌కాల స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీఐపీ ప్లాన్ అయితే రూ.399కు ల‌భిస్తుంది. కానీ ఆయా టెలికాం సంస్థ‌ల‌కు చెందిన ప‌లు ప్రీపెయిడ్ ప్లాన్ల‌తో హాట్‌స్టార్ వీఐపీ ప్లాన్ ఉచితంగా ల‌భిస్తుంది. ఇక పోస్ట్‌పెయిడ్ అయితే ఎంపిక చేసిన ప్లాన్ల‌తో హాట్ స్టార్ వీఐపీ ప్లాన్ ల‌భిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు ఆ అకౌంట్‌లో ఉన్న సూప‌ర్ కాయిన్ల‌ను ఉప‌యోగించి హాట్ స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీంతో హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఉచితంగా వీక్షించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment