SBI కస్టమర్లకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న సరికొత్త ఫీచర్..

July 31, 2021 8:56 PM

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? అయితే మీరు నిజంగా ఒక శుభవార్త అని చెప్పవచ్చు.దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా ఆన్లైన్ ద్వారా జరిగే మోసాలను అరికట్టడానికి వీలు ఉంటుంది.ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ కస్టమర్లకు భద్రత దృష్ట్యా ఎస్బిఐ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

ఎస్‌బీఐ యోనో లైట్ వాడే కస్టమర్ల కోసం SBI సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ క్రమంలోనే లేటెస్ట్ యోనో లైట్ యాప్ ను కస్టమర్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్‌బీఐ వెల్లడించింది.

ఎస్‌బీఐ యోనో లైట్ యాప్‌కు సిమ్ బైండింగ్ ఫీచర్ ను జోడించింది. ఈ క్రమంలోనే SBI కస్టమర్ ఫోన్ లో బ్యాంక్ అకౌంట్ కు రిజిస్టర్ చేయించుకున్న మొబైల్ నెంబర్ ఫోన్ లో ఉంటేనే ఈ యోనో లైట్ యాప్ ఉపయోగించడం సాధ్యమవుతుంది. ఈ క్రమంలోనే ఆన్లైన్ లావాదేవీలలో ఎలాంటి అవకతవకలు, మోసాలు జరగకుండా ఆపవచ్చు అనే ఉద్దేశంతో ఎస్‌బీఐ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు.SBI తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యోనో లైట్ యాప్‌ను కేవలం ఒక డివైస్ లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment